హామీల అమలుపై వివరణ ఇవ్వాలి

తెరాస ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలు, మ్యానిఫెస్టోలో పెట్టిన విషయాల పై ప్రగతినివేదిక సభలో మాట్లాడాలి. కేసీఆర్ సీఎం అయ్యాక మొదటి ప్రసంగంలో అందరిని కలుపుకొని తెలంగాణను అభివృద్ధి చేస్తాం అందరిని కలుపుకొని పోదాం అన్నారు. కానీ కేసీఆర్ మాత్రం అన్ని పార్టీల నేతలను తన పార్టీలో కలుపుకుంటారని అనుకోలేదని టీటీడీపీ సినీయర్ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి విమర్శించారు. గురువారం నాడు అయన ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ మీడియా పాయింట్ లో మాట్లాడారు. సీఎం కేసీఆర్ వచ్చే నెలలో ప్రగతినివేదిక సభలో వివరణ ఇవ్వాలి. కేసీఆర్ మొదటి ప్రసంగం పై ప్రగతి నివేదిక సభలో మాట్లాడాలి. ఇవాళ్టి నుంచి సెప్టెంబర్ 2వ తేదీ వరకు టిటిడిపి నేతలు ఎన్టీఆర్ భవన్ నుంచి రోజుకొకరు కేసీఆర్ ప్రభుత్వం వైఫల్యాల పై ప్రశ్నిస్తామని అయన అన్నారు. తెలంగాణ ప్రజలకు కేసీఆర్ వాచ్ డాగ్ లాగా ఉంటానన్నారు. దళితుడు సీఎం అన్నారు. ప్రగతినివేదిక సభలో టిటిడిపి ప్రశ్నించే అంశాలను పొందుపర్చాలి. కేసీఆర్ క్యాబినెట్ లో మహిళా మంత్రి ఎందుకు లెరో చెప్పాలి. తుమ్మల, కడియం, నాయిని, మహుమద్ అలీ లాగా మహిళను మంత్రివర్గంలోకి ఎందుకు తీసుకోలేదు. టీఆరెస్ పార్టీ ప్రతిపక్షాల ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా కన్ ఫ్యూజ్ చెయ్యడంలో దిట్ట అని అయన ఆరోపించారు. రోజుకో సమస్య పై టిటిడిపి వివరణ ఇస్తాం. ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేసారు. మొదటి సమస్య డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి. 1లక్ష 86వేల ఇండ్లకు కేంద్రం నుంచి నిధులు ఇస్తే… రాష్ట్ర ప్రభుత్వం 9వేల ఇండ్లు పూర్తి చేశారు. సమగ్ర కుటుంబ సర్వే లో 20లక్షల ప్రజలకు ఇండ్లు లేవనీ లెక్కలు ఉన్నాయి..మరి 4ఏండ్లలో కేసీఆర్ ప్రభుత్వం కట్టింది 9వేలు మాత్రమే. కేసీఆర్ ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం లేదని ఆయన ఫ్లెక్సీలకు దావత్ లు ఇస్తున్నారు ప్రజలు. పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ నిర్మాణం కోసం నిధులు, మనుష్యులు ఉన్నారు…కానీ పేదలకు ఇళ్లు నిర్మాణం కోసం నిధులు, మనుష్యులు దొరకడం లేదు. గృహనిర్మాణం మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి గృహాలను వదిలేసి గుడుల వెంట తిరుగుతున్నారని అయన విమర్శించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP Facebook Auto Publish Powered By : XYZScripts.com