వాటర్ ట్యాంకులో విషం కలిపిన మాజీ సర్పంచ్

కృష్ణాజిల్లా నూజివీడు మండలం బత్తులవారిగూడెం గ్రామంలో కలకలం రేగింది. మాజీ సర్పంచ్ శ్రీను గ్రామ వాటర్ ట్యాంక్ లో విషం కలిపినట్లు తెలియగానే పోలీసులు రంగప్రవేశం చేసారు. ప్రత్యర్ధి పార్టీకి చెందిన నలుగురు యువకులు వాటర్ ట్యాంకుపై కూర్చుండటాన్ని సహిoచక ఆగ్రహంతో శ్రీను విషం కలిపాడని గ్రామస్థులు అంటున్నారు. విషయం తెలుసుకున్న తరువాత హుటాహుటిన నీటి సరఫరాను నిలిపి వేసారు. నిందుతుడు శ్రీను పరారిలో వుండగా కొందరు యువకులను పోలీసులుఅదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ ఘటనతో గ్రామంలో రాజకీయ విద్వేషాలు ఒక్కసారిగా చెలరేగాయి. పండుగ కారణంగా సెల్ఫీ కోసం యువకులు వాటర్ ట్యాంక్ ఎక్కినట్లు సమాచారం. వారిని అడ్డగించి వాటర్ ట్యాంక్ ఎందుకు ఎక్కారు అంటూ శ్రీను నిలదీసాడు. కోపంతో వాటర్ ట్యాంకులో విషం కలిపాడని యువకుల వాదన. వాటర్ ట్యాంకులో విషం కలపడాన్నియువకులు మోబైల్ ఫోన్లలో చిత్రీకరించారు. శ్రీని కలిపిందని పెట్రోల్ అని పోలీసులు అనుమానిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP Facebook Auto Publish Powered By : XYZScripts.com