హైకోర్టును ఆశ్రయించిన దుర్గగుడి మాజీ సభ్యురాలు

విజయవాడ కనకదుర్గ ఆలయ వ్యవహారం కోర్టు మెట్లు ఎక్కింది. గుడిలో అమ్మవారి చీర పోయినందుకు ట్రస్ట్ బోర్డు మెంబర్ గా తనను తీసివేయడాన్ని సవాలు చేస్తూ దుర్గగుడి ధర్మకర్తలమండలి మాజీ సభ్యురాలు కోడెల సూర్యలత కుమారి హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసరు. ఆమె వేసిన పిటిషన్ విచారణకు హైకోర్టు అనుమతించింది. తరువాత దుర్గ గుడి ఈవో,ప్రిన్సిపాల్ సెక్రటరీ ఎండోన్మెంట్,ట్రస్ట్ బోర్డ్ కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లో పూర్తి నివేదిక సమర్పించాలని ధర్మాసనం కోరింది. తదుపరి విచారణను నాలుగువారాలకు వాయిదా వేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP Facebook Auto Publish Powered By : XYZScripts.com