భారత్ కు ఎస్టీయే హోదా

భారత్‌కు ఎస్టీయే-1 హోదా ఇవ్వాలని అమెరికా నిర్ణయం తీసుకుంది. ఈ ‘వ్యూహాత్మక వాణిజ్యహోదా’తో అమెరికా మిత్రదేశాలకు ఎలాంటి రాయితీలు అందుతాయో

అవన్నీ భారత్‌కు కూడా అందనున్నాయి. ట్రంప్ సర్కార్ తాజా నిర్ణయంతో భారతీయులు హర్షం వ్యక్తం చేస్తుండగా.. చైనా, పాక్ లాంటి దేశాలు మాత్రం గుర్రుగా ఉన్నట్టు

తెలుస్తోంది. బరాక్ ఒబామా హయాంలో ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన 4 కూటముల్లో సభ్యత్వం ఉన్న దేశాలకే సైనిక ఆయుధాలను విక్రయిస్తామని అమెరికా

నిబంధనను తీసుకువచ్చింది.ఆ నాలుగు కూటములు.. అణు ఇంధన సరఫరాదారుల కూటమి (ఎన్‌ఎస్‌జీ), ఆస్ట్రేలియా కూటమి, వాసెనార్‌ ఒప్పందం, క్షిపణి పరిజ్ఞాన

నియంత్రణ వ్యవస్థ. వీటిలో అణు ఇంధన సరఫరాదారుల కూటమిలో తప్ప మిగిలిన మూడింటిలో భారత్‌కు సభ్యత్వం ఉంది. న్‌ఎస్‌జీలో సభ్యత్వం కోసం గత కొంత

కాలంగా భారత్‌ తీవ్రంగా ప్రయత్నించింది. కానీ, చైనా గట్టిగా అడ్డుచెప్పడంతో మనకు సభ్యత్వం రాలేదు. మిగతా దేశాలన్నీ అనుకూలంగా ఉన్నా.. చైనా అడ్డుపడుతోంది.

అంతేకాకుండా భారత్‌-అమెరికా రక్షణ ఒప్పందాలపై, ముఖ్యంగా సాంకేతిక బదలాయింపుపై చైనా వ్యతిరేకత వ్యక్తం చేస్తోంది. ఒబామా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో

చైనా ఒత్తిడి వల్లే భారత్‌కు నూతన పరిజ్ఞాన బదలాయింపు జరగలేదు. అయితే ట్రంప్‌ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత దూకుడుగా నిర్ణాయాలు

తీసుకుంటున్నారు. చైనాను నిలువరించడానికి వీలుగా ఆ దేశం భారత్‌కు ప్రాధాన్యం ఇస్తోంది.అమెరికాకు సంబంధించి 2 ఆయుధ నియంత్రణ వ్యవస్థలు ఉన్నాయి.

అంతర్జాతీయ ఆయుధాలపై నియంత్రణ, ఎగుమతుల నియంత్రణలు ఉన్నాయి. ఒబామా హయాంలోనే రక్షణ వ్యవస్థలో భారత్‌కు కీలక భాగస్వామి హోదా ఇచ్చారు.

అయితే దీనికి సంబంధించి చట్ట సవరణ పూర్తికాలేదు. తాజాగా సవరణకు సంబంధించి అమెరికా కాంగ్రెస్‌ చర్యలు ప్రారంభించింది. ఎస్టీయే హోదాతో నాటో దేశాలతో

సమానంగా భారత్‌కు హోదా రానుంది. ఇంకా అమెరికా నుంచి రక్షణ ఉత్పత్తులను దిగుమతి చేసుకోనే అవకాశంఅత్యాధునిక ఆయుధాలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని పొందే

సౌలభ్యం లభిస్తుంది. నూతన ఆయుధ ఆవిష్కరణలను తెలుసుకునే అవకాశం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP Facebook Auto Publish Powered By : XYZScripts.com