ఎలుగుబంటి దాడిలో తీవ్రగాయాలు బాధితుడికి పునర్జన్మనిచ్చిన డాక్టర్లు

ఎలుగు బంట్ల దాడిలో తీవ్రగాయాలై రెండు కనుగుడ్లు బయటకి వచ్చి, తీవ్ర గాయాల పాలయని వ్యక్తికి వైద్యులు పునర్జన్మనిచ్చారు. అతడికి మూడు శస్త్ర చికిత్సలు చేసి ప్రణాలు నిలబెట్టారు. నల్గొండ జిల్లా చందంపేట మండలం నక్కదుబ్బ తండాకు చెందిన లింగయ్య తన గొర్రెలని మేపడానికి సమీపం లోని బీడు భూముల వద్దకి వెళ్లాడు. అక్కడ గొర్రెలని మేపుతుండగా వర్షం రావడం తో ఒక చెట్టుకింద నిలబడ్డాడు. అక్కడే వున్న రెండు ఎలుగుబంటులు ఒక్కసారిగా దాడి చేసాయి. ఈ ఘటనలో లింగయ్య మొహానికి ఎక్కువగా గాయాలు అయ్యాయి. కనుగుడ్లు కూడా బయటకి రావడం తో తీవ్ర గాయాలైన లింగయ్యకి స్థానికులు హైదరాబాద్ హస్తినపురం అమ్మ హాస్పిటల్ కి తరలించారు. వైద్యులు సుమారు పది గంటలపాటు శ్రమపడి మూడు శస్త్రచికిత్సలతో రోగి తొడకి ఉన్న చర్మాన్ని తీసి మొహానికి వేసి చికిత్స చేసారు. లింగయ్య పరిస్థితి నిలకడగా ఉందని మొహం పై కూడా పూర్వం ఎలా ఉందో ఆ స్ధితికి వస్తుందని వైద్యులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP Facebook Auto Publish Powered By : XYZScripts.com