భోజనం పెట్టరా..?

జూనియర్‌ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశ పెట్టిన ప్రభుత్వం ఎయిడెడ్‌ కళాశాలలను విస్మరించింది. ఉపకార వేతనాలు, పుస్తకాలు, ఇతర సంక్షేమ పథకాలు ప్రభుత్వ కళాశాలలతో సమానంగా ఎయిడెడ్‌ కళాశాలలకు వర్తింప చేసిన ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకం విషయంలో మాత్రం చిన్నచూపు చూసింది. తొలుత జీవోలో ఎయిడెడ్‌ కళాశాలల విద్యార్థులకూ ఈ పథకం అమలు చేయాలని పేర్కొన్నా, ఆ తరువాత మినహాయించడంపై సర్వత్రా అసంతృప్తులు వెల్లువెత్తుతున్నాయి. ఆగస్టు 1వ తేదీ నుంచి కేవలం ప్రభుత్వ కళాశాలల్లోని విద్యార్థులకు మాత్రమే మధ్యాహ్న భోజనం అందిస్తున్న విషయం తెల్సిందే.

జిల్లాలో 42 ప్రభుత్వ కాలేజీలుండగా.. అందులో 14,357 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. 11500 మంది మధ్యాహ్న భోజనం ద్వారా లబ్ధి పొందుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 8 ఎయిడెడ్ కాలేజీల్లో 4,356 మంది విద్యార్థులున్నారు. ఆగస్టు 1వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉండే ప్రభుత్వ, ఎయిడెడ్‌ కళాశాల్లోని విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఎయిడెడ్‌ కళాశాలల యాజమాన్యాలు, విద్యార్థులు సంతోషించారు. అయితే జీవో 215 తీసుకురావడంతో అందులో మధ్యాహ్న భోజన పథకానికి ఎయిడెడ్‌ కళాశాలలను మినహాయిస్తూ, కేవలం ప్రభుత్వ కళాశాలల విద్యార్థులకే భోజన వసతి కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

జిల్లాలో 42 ప్రభుత్వ కళాశాలలు ఉండగా 14,357 మంది విద్యార్థులు ఉన్నారు. ఇందులో 11,500 మంది మధ్యాహ్న భోజన వసతిని పొందుతుండగా.. ఎయిడెడ్‌ కళాశాలల్లోని 4,356 మంది దీనికి నోచుకోలేకపోయారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP Facebook Auto Publish Powered By : XYZScripts.com