ఏడు ద్వీపాల అభివృద్దకి డిఎల్ ఎఫ్ ఒప్పందం

కృష్ణానది లో ఏడు ద్విపాల అభివృద్ధి కి డి ఎల్ ఎఫ్ సంస్థ తో ఒప్పందం కుదుర్చుకున్న ట్లు పురపాలక శాఖ మంత్రి నారాయణ అన్నారు.ఆయన గురువారం నాల్గవ బ్లాక్ నందు విలేకరులకు ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. డి ఎల్ ఎఫ్ తో ఒప్పందం ప్రకారం కృష్ణ నది సమీపాన రిసార్ట్స్, విల్లాలు, గోల్ఫు సెంటర్, కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటు చేస్తామని మంత్రి అన్నారు. ఆ సంస్థ నాలుగు నెలలు సమయం అడిగారు. అయితే టెండర్ల ప్రక్రియను చేయాల్సి ఉంది. ఆలోగా మంచి సంస్థలు ముందుకొస్తే వాటికి కూడా అవకాశం ఇస్తామని మంత్రి తెలిపారు. ఇందులో అమరావతిలో మీడియా సిటీ ని ఏర్పాటు చేస్తామని మంత్రి పేర్కొన్నారు. అమరావతి బాండ్ల పై కొంతమంది ఓర్వలేక ఆరోపణలు చేస్తున్నట్లు మంత్రి వివరించారు. ఒక గంటలో 2వేల కోట్లు బాండ్లకు డిమాండ్ ఏర్పడినట్లు మంత్రి తెలిపారు. ఈ విషయం దేశం మొత్తం మీద చర్చ జరుగుతుందని మంత్రి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును చూసే బాండ్ల ప్రక్రియ పై నమ్మకం ఏర్పడినట్లు మంత్రి వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP Facebook Auto Publish Powered By : XYZScripts.com