ఆకట్టుకుంటున్న  డిజిధన్ మేళా

0
digidhanmela-apduniaఆధార్ కార్డు లో మార్పు చేర్పులు, కొత్త కార్డు పొంద డానికి గంటల తరబడి కౌంటర్ మందు నిలబడి అసహనానికి గురయ్యే వారికి ఉపశమనాన్ని కలిగించేందుకు  మంచి అవకాశాన్ని కల్పించింది ఆధార్ సంస్థ .విజయవాడ ఇందిరా గాంధీ స్టేడియంలో ఏర్పాటుచేసిన డిజిధన్ మేళ లో ఆధార్  ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్ ప్రజల్ని ఆకట్టుకొంది.  రెండు రోజుల పాటు లక్కీ గ్రాహక్ యోజన, డిజిధన్ వ్యాపార యోజన కార్య క్రమం లో భాగం గా ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమం లో కొత్త ఆధార కార్డు కావాల్సిన వారు లేదా ఇప్పటికే ఆధార్ కార్డు ఉన్న వారు కార్డు లో మార్పులు కోసం ఈ కేంద్రాన్ని సందర్శించటం ద్వారా మార్పులు చేసుకోవచ్చు. ఐతే మార్పులకు కేవలం 25 రూపాయలు చెల్లిస్తే సరిపోతుందని చెప్తున్నారు.కొత్త కార్డు జారీ కోసం సంబంధిత రుజువు పాత్రలను సమర్పించినట్లైతే వెంటనే కార్డు పొందే అవకాశం కల్పించారు. ఆధార్ లో పేర్పల, చిర్పనామాలు, ఇతర వివరాలు మార్పాకోడానికి తప్పని సరిగా ఆధార్ కాపీ ని, తగిన ఆధారాలతో సమర్పించాలని నిర్వాహకులు తెలిపారు.నగదు రోహిత్ అలావాదేవీలే లక్ష్యం గా ఈ కౌంటర్ ను ఏర్పాటు చేయడం జరిగిందని ఈ కౌంటర్ ను వృద్దులు గృహిణులు , వికలాంగులకు ప్రత్యేక సేవలు అందిస్తున్నారు .ఈ మేళా లో 80 స్టాల్ల్స్ ఏర్పాటు చేసారు .ప్రజల నుంచి ఈ మేళాకు భారీ స్పందన లభిస్తోంది.
Share.

Comments are closed.