ధోనికి చేదు అనుభవం మిగిల్చిన చివ‌రి మ్యాచ్

0

msdhoni-apduniaజార్ఖండ్ డైన‌మైట్ మ‌హేంద్ర‌సింగ్ ధోనీకి చేదు అనుభ‌వం మిగిలింది. తాను చివ‌రిసారిగా కెప్టెన్సీ బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించిన మ్యాచ్‌లో భార‌త్ ఏ జ‌ట్టు ఇంగ్లాండ్ చేతిలో ఓట‌మి చ‌విచూసింది. మొద‌ట బ్యాటింగ్ చేసి 305 ప‌రుగుల టార్గెట్‌ను ఇంగ్లీష్ జ‌ట్టు ముందుంచింది ధోనీ సేన‌. భార‌త్ నిర్దేశించిన విజ‌య‌ల‌క్ష్యాన్ని ఇంగ్లండ్ ఏడు వికెట్లు కోల్పోయి 48.5 ఓవ‌ర్ల‌లో చేధించింది. ఇంగ్లండ్ త‌ర‌పున బిల్లింగ్స్ 93 ప‌రుగులు చేయ‌గా ఓపెన‌ర్ రాయ్ 62 ప‌రుగులు చేశాడు.భార‌త బౌల‌ర్ల‌లో కుల్దీప్ యాద‌వ్ 60 ప‌రుగులు ఇచ్చి 5 వికెట్లు తీసుకున్నాడు. అంత‌కుముందు బ్యాటింగ్ చేసిన ధోనీ సేన నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల న‌ష్టానికి 304 ప‌రుగులు చేసింది. హైద‌రాబాదీ కుర్రాడు అంబ‌టి రాయుడు సెంచ‌రీ చేసి ఆక‌ట్టుకోగా, ధోనీ, యువ‌రాజ్‌లు మెరుపులు మెరిపించి పూర్వ‌పు ఫామ్ ను త‌ల‌పించారు. మొత్తానికి ధోని కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రించిన చివ‌రి మ్యాచ్ ఓట‌మితో ముగియ‌టం చాలామంది క్రికెట్ ఫ్యాన్స్‌ను కుంగ‌దీసింది.

Share.

Comments are closed.