సమాచార పౌర సంబంధాల శాఖ రిటైర్డ్ డిప్యూటి డైరెక్టర్ మురళీ మోహన్ మరణం పట్ల సంతాపం

సమాచార పౌర సంబంధాల శాఖలో డిప్యూటి డైరెక్టర్ గా పని చేసి పదవి విరమణ అనంతరం మెట్రో రైల్ పి.ఆర్.ఓ. గా పని చేస్తున్న మురళీ మోహన్ మంగళవారం మరణించడం పట్ల సమాచార పౌర సంబంధాల శాఖ అధికారులు, సిబ్బంది తీవ్ర సంతాపం తెలిపారు. మురళీ మోహన్ సమాచార పౌర సంబంధాల శాఖలో జూనియర్ అసిస్టేంట్ గా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించి డిప్యూటి డైరెక్టర్ గా ఎదిగారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వీరు చాలా మంది మంత్రుల వద్ద పి.ఆర్.ఓ గా సేవలు అందించారు. సచివాలయం పబ్లిసిటి సెల్ ఉప సంచాలకులుగా వీరు అందరికి సుపరిచితులు.వీరు గత రెండు వారాల నుండి ఆనారోగ్యంతో బాధపడుతూ మంగళవారం మృతి చెందారు. వీరి అత్మకు శాంతి కలగాలని , వారి మరణం పట్ల వారి కుటుంబ సభ్యులకు సమాచార పౌర సంబంధాల అధికారులు మరియు ఉద్యోగులు తమ ప్రగాడ సంతాపాన్ని వెలిబుచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP Facebook Auto Publish Powered By : XYZScripts.com