టార్గ్ ట్ నిర్ణయించుకొండి ‘జ్ఞానభేరి’ లో సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవితవ్యం యువత చేతుల్లో . ఉంది. విద్యార్థుల్లో సామర్థ్యం పెంపే లక్ష్యంగా తిరుపతిలో ‘జ్ఞానభేరి’ కార్యక్రమం నిర్వహించాం. 2022 నాటికి రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రస్థానంలో నిలుపుతాము అందులో ఎటువంటి సందేహం లేదు. రాష్ట్రాన్ని ప్రపంచ పటంలో పెట్టేందుకు యువతలో నైపుణ్యాలు పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. శనివారం తిరుపతి తారకరామా మైదానంలో నిర్వహించిన జ్ఞాన భేరి కార్యక్రమంలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. ఈ ఎస్వీయూ ప్రాంగణం చూస్తే నా చిన్న తనం గుర్తుకొస్తుంది, విద్యార్థి దశ చాలా కీలకం. తిరుపతి నుంచే రాజకీయాలు నేర్చుకున్నాను..నేను విద్యార్థిగా ఉన్న సమయంలోనే పరిపాలన పరంగా మంచి జ్ఞానం పెంచుకున్నానని అయన అన్నారు. ఏదేశానికీ లేని అనుకూలతలు భారత్కు, ఆంధ్రప్రదేశ్కు ఉన్నాయి. ప్రపంచంలో ప్రతి నలుగురు ఐటీ నిపుణుల్లో ఒకరు భారతీయలు ఉన్నారు. మైక్రో సాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల ను స్ఫూర్తిగా తీసుకోవాలి. మనం ఉద్యోగాలు చేయడం కాదు.. ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలి. అన్ని రంగాల్లో సరికొత్త ఆవిష్కరణల ద్వారా రాష్ట్రాభివృద్ధికి కృషి చేయాలి, విద్యార్థులు అనుకుంటే అది చాలా సులభమని అయన అన్నారు. ప్రపంచం మారుతున్నట్టే సాంకేతిక రంగంలో కూడా మార్పులు శరవేగంగా వస్తున్నయి. భవిష్యత్లో చేతిలో సెల్ఫోన్ తోనే అన్ని ప్రభుత్వ సేవలు పొందే రోజులు తీసుకు వస్తామని అన్నారు. గతంలో ముందుచూపుతో పరిపాలించాను కాబట్టే హైటెక్ సిటీ ఇంత స్ధాయిలో గుర్తింపు పొందింది. 1995లోనే ఆంధ్రప్రదేశ్ పూర్తిగా వ్యవసాయ ఆధారిత రాష్ట్రమైంది, నా ముందుచూపుతోనే ఐటీ రంగాన్ని ప్రోత్సహించి హైటెక్ సిటీని నిర్మించానని చంద్రబాబు అన్నారు. ఆనాడు ఐటీ రంగాన్ని ప్రోత్సహించడం వల్లే హైదరాబాద్ అభివృద్ధి చెందింది. ఆనాడు తాను తీసుకున్న చర్యల వల్లే 1350 కంపెనీలు హైదరాబాద్కు వచ్చాయి. ఇవాళ హైదరాబాద్ ద్వారా అధిక ఆదాయం వస్తుందంటే ఆనాడు తాను వేసిన పునాదులే కారణం. రాష్ట్రానికి అన్యాయం జరిగింది, 2014 లో ఇదే వేదికపై నుంచి మోడీ ఏపీని ఆదుకుంటామన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏపీని మోసం చేసింది..ప్రత్యేక హోదా విషయంలో రాజీ పడేది లేదు, మన హక్కులు సాధించుకుంటామని అయన అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *