టెక్నాలజీతో పోటీ పడుతున్న కాప్స్

పోలీస్ వ్యవస్థను మరింత పటిష్టం చేసేందుకుగాను అందుబాటులో ఉన్న సాంకేతికతను వినియోగించుకొనే దిశగా సర్కారు అడుగులు వేస్తుంది.
సమాచార, సాంకేతికపరమైన అవరోధాల నడుమ నెట్టుకొస్తున్న పోలీస్ శాఖకు మరిన్ని జలసత్వాలు నింపే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులోభాగంగానే జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లను శాటిలైట్‌తో అనుసంధానం చేయబోతున్నారు. ఈ అనుసంధానాన్ని ఆసరాగా చేసుకొని పోలీస్ శాఖ క్రైం అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్‌వర్క్ సిస్టం (సిసిటిఎన్‌ఎస్)ను రూపొందించింది. దీంతో పోలీస్ శాఖల పనితీరు ఆ శాఖకు సంబంధించిన ఆదేశాలు సమాచార చేరవేత లాంటి అంశాలన్నింటిని నేరుగా డీజీపీ స్థాయి అధికారి పర్యవేక్షించే అవకాశం ఏర్పడబోతుంది. ఇప్పటి వరకు ఆయా పోలీస్ స్టేషన్లలో జరుగుతున్న సాధారణ కార్యకలాపాల వివరాలు రాష్ట్ర స్థాయికి చేరాలంటే సమయం పట్టేది. ఇకనుంచి సిసిటిఎన్‌ఎస్ విధానంతో ఆయా పో లీస్ స్టేషన్లలో జరుగుతున్న కార్యకలాపాలన్ని డీజీపీ ఉన్న చోటు నుంచే వీక్షించడమే కాకుండా అప్పటికప్పుడే ఆదేశాలు సైతం జారీ చేసే అవకాశం ఏర్పడబోతుంది.ముఖ్యంగా సమాచార వ్యవస్థలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అనేక అవరోధాలను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. జిల్లాలోని అనేక మారుమూల ప్రాంతాలకు ఇప్పటికీ సైతం సమాచార వ్యవస్థ దూరంగా ఉన్న సంగతి విదితమే. ఇప్పటికీ అనేక పల్లెలకు కనీసం సెల్ ఫోన్ నెట్‌వర్క్ సైతం అందని పరిస్థితులు ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. ఈ క్రమంలో పోలీస్ వ్యవస్థ అనేక సాంకేతిక పరమైన అవరోధాలను ఎదుర్కొంటూ నేరాల అదుపు, ట్రాఫిక్ సమస్య ఇతరత్రా సమస్యల పరిష్కారానికి ఆపసోపాలు పడుతోంది.
ముఖ్యంగా నేరాలు జరిగే తీరు, నేరస్థుల ఆచూకి అలాగే వారి గత, ప్రస్తుత కార్యకలాపాల వివరాలన్నీ సిసిటిఎన్‌ఎస్ విధానంతో అన్ని పోలీస్ స్టేషన్లు అప్పటికప్పుడే తెలుసుకొనే అవకాశం ఏర్పడబోతుంది. దీనికి పోలీస్‌స్టేషన్లలోని రైటర్లు కీలక భూమిక పోషించబోతున్నారు. ఆన్‌లైన్‌లోనే ఇక నుం చి చార్జిషీట్లను దాఖలు చేసే వీలు ఏర్పడబోతుంది. దీంతో కే సుల పరిష్కారంలో జాప్యం తగ్గబోతోందని అంటున్నారు. కాగా పె ట్రోలింగ్, వాహనాల తనిఖీ, బీట్ డ్యూటీ, ట్రాఫిక్ డ్యూటీలను ని ర్వహిస్తున్న పోలీసుల పనితీరును నేరుగా పర్యవేక్షించే అవకాశం కలగబోతుంది. ప్రస్తుతం మొదటి దశలో భాగంగా పోలీస్‌స్టేషన్లకు సిసిటిఎన్‌ఎస్‌ను అమలు చేయబోతుండగా రాబోయే రోజులలో జైళ్లకు, కోర్టులకు కూడా దీని పరిధిలోకి తీసుకువచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP Facebook Auto Publish Powered By : XYZScripts.com