కాంగ్రెస్ ఎమ్మెల్యేల వ్యవహారం సింగిల్ బెంచ్ తీర్పు పై స్టే

కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్‌కుమార్‌ల శాసనసభ సభ్యత్వం రద్దు కేసు మరో మలుపు తిరిగింది. ఇద్దరు ఎమ్మెల్యేల సభ్యత్వాలను పునరుద్దరిస్తూ హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును.. డివిజన్ బెంచ్ రెండు నెలల పాటూ స్టే విధించింది. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సమయంలో ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి, సంపత్‌లను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారు. ఇద్దరి సభ్యత్వాలను రద్దు చేయగా.. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఎమ్మెల్యేలు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన సింగిల్ బెంచ్.. వారిద్దరి సభ్యత్వాలను పునరుద్ధరించాలని తీర్పు ప్రకటించింది. అలాగే వారికి గన్‌మెన్లను కేటాయించాలని ఆదేశించింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును అమలు చేయడం లేదంటూ కోమటిరెడ్డి, సంపత్‌లు మళ్లీ కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన సింగిల్ బెంచ్.. స్పీకర్‌, అసెంబ్లీ కార్యదర్శి, న్యాయశాఖ కార్యదర్శిలకు నోటీసులు జారీ చేసింది. గన్‌మెన్ల విషయంలో డీజీపీ.. గద్వాల్, నల్గొండ ఎస్పీలకు కూడా నోటీసులు పంపారు. అయితే హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై తెలంగాణ ప్రభుత్వం హైకోర్టు డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించింది. రాష్ర్ట ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ.. ఈ ఉత్తర్వులను నిలిపివేయాలని కోరారు. దీంతో కోర్టు అసెంబ్లీ, న్యాయశాఖ కార్యదర్శులపై కోర్టు ధిక్కరణ పిటిషన్‌ను రెండు నెలల పాటు నిలిపివేస్తూ ఆదేశాలిచ్చింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP Facebook Auto Publish Powered By : XYZScripts.com