కలెక్టర్ ఆమ్రపాలికి దెయ్యం భయ్యం

అధికారుల్లో వణుకు పుట్టించే వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ అమ్రపాలి కూడా భయపడతారా? ఔననే అంటున్నారు ఆమె. ఇంతకీ ఆమెను భయపెడుతోంది మరేదో కాదు.. ఓ దెయ్యం! అది మరెక్కడో కాదు.. ఆమె నివసిస్తున్న కలెక్టర్ బంగ్లాలోనే ఉంది. ఈ విషయాన్ని ఆమే స్వయంగా వెల్లడించారు. బంగ్లాలోని మొదటి అంతస్తులో ఆ దెయ్యం ఉందని తెలిపారు. ఆగస్టు 10న ఆమె నివసిస్తున్న కలెక్టర్ బంగ్లాకు 133 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో ఆమె ఓ చానెల్‌తో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు తెలిపారు. ‘‘నేను ఇక్కడికి కలెక్టర్‌గా వచ్చినప్పుడు.. నాకంటే ముందు పనిచేసిన కలెక్టర్లు ఫోన్ చేసి అభినందిస్తూ.. బంగ్లాలోని మొదటి అంతస్థులో దెయ్యం ఉందని చెప్పారు. నేను అక్కడికి వెళ్లి చూస్తే ఫర్నీచర్ అంతా చెల్లా చెదురుగా పడి ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ క్లీన్ చేసి, గదిలా వాడుతున్నాం. అయితే, రాత్రిళ్లు పడుకోవాలంటేనే భయం’’ అని తెలిపారు. బంగ్లా ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుందని, సమీపంలో పచ్చని బయళ్లు, ఉద్యానవనాలతో పాటు బంగ్లాలో దెయ్యాలు కూడా ఉండటం ఆనందంగా ఉందని ఆమె సరదాగా వ్యాఖ్యానించారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పుడు చర్చంతా ఆ బంగ్లాలో ఉన్న దెయ్యం గురించే చర్చ జరుగుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *