మన్నెం వీరుడుగా మెగాస్టార్

0

ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి పాత్రలో వీర యోధుడిగా ఈ సినిమాలో చిరంజీవి కనిపించనున్నారు. అంతేకాదు ఈ సినిమాలో ఆయన అల్లూరి సీతారామరాజుగా కూడా కనిపించనున్నాడని చెబుతున్నారు.ఆంగ్లేయుల చేతిలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ప్రాణాలు కోల్పోయిన తరువాత, ఆయన స్ఫూర్తితో కొంతమంది విప్లవ వీరులు ఆంగ్లేయులపై తిరుగుబాటు చేశారు. అలాంటి వీరులలో అల్లూరి సీతారామరాజు ఒకరు. ఆయన పాత్రకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన షాట్స్ లోను చిరంజీవి కనిపించనున్నారని అంటున్నారు. అల్లూరి సీతారామరాజుగా చిరంజీవి కనిపించనుండటం ఆయన అభిమానుల్లో మరింత ఆసక్తిని రేకెత్తించే విషయం. చరణ్ నిర్మిస్తోన్న ఈ సినిమా వచ్చే వేసవి సెలవుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Share.

About Author

Leave A Reply