మెగాస్టార్ 151వ చిత్రం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి

0

chiranjeevi-uyyalawada-apduniaమెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం ‘ఖైదీ నెం.150’ సంక్రాంతి కానుకగా ఈనెల 11వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్రం విడుదల కాకముందే చిరంజీవి తన 151వ చిత్రం గురించి చర్చిస్తున్నట్టు ఫిల్మ్ నగర్‌లో జోరుగా ప్రచారం సాగుతోంది. ఆ చిత్రం పేరు ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’. ఈ చిత్రానికి మాస్ డైరక్టర్ బోయపాటి శ్రీను లేదా సురేందర్ రెడ్డి లేదా త్రివిక్రమ్ దర్శకత్వం వహించే అవకాశాలు ఉన్నాయి. చిత్ర కథ దృష్ట్యా బోయపాటి శ్రీను దర్శకత్వం వహించవచ్చని తెలుస్తోంది. వాస్తవానికి 150వ సినిమా కోసం కథలు వినే సమయంలో “ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి” కథను చిరంజీవి విన్నారు. ఆ సమయంలోనే ఈ కథను తన 151వ చిత్రంగా తీయాలని అనుకున్నారు. అదే సమయంలో దర్శకుడు సురేందర్ రెడ్డి కూడా ఓ కథని చెప్పారు. ఈ కథ కూడా చిరంజీవికి నచ్చింది. ఈ రెండు చిత్రాల్లో ఏదో ఒకటి తన 151వ చిత్రంగా ఉండబోతుందన్నది ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం.

Share.

Comments are closed.