చిలుకూరు బాలాజీకి అగ్ని పరీక్ష

0

Chilkur-Balaji-Temple_apduniaతెలుగు రాష్ట్రాల్లోని వారికి, అందునా అమెరికా వంటి దేశాలకు వెళ్లాలని కోరుకునే వారికి పరిచయం అక్కర్లేని దేవుడు చిలుకూరు బాలాజీ. ఆయన్నే వీసా బాలాజీ అని కూడా అంటారు. ఈ గుడిని సందర్శించి 11 సార్లు దేవుడికి ప్రదక్షిణ చేసి, ఓ తులసి దళాన్ని దేవుడి పాదాల ముందు ఉంచితే వీసా వస్తుందని నమ్మేవారు కోట్లలో ఉన్నారు. వీసా వచ్చిన తరువాత తిరిగి దేవుడిని సందర్శించుకుని 108 చుట్లు చుట్టి మొక్కు తీర్చుకోవాల్సి ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఇక వడ్లమాని మధు (25), చిలకమర్రి రేవంత్ (29) సైతం తమ అమెరికా కలను నెరవేర్చుకునేందుకు వీసా బాలాజీని కొన్నేళ్ల క్రితం సందర్శించారు. ఇద్దరికీ స్టూడెంట్ వీసాలు రాగా విడివిడిగా అమెరికాకు వెళ్లి, అక్కడ ప్రేమలో పడి ఒకటయ్యారు. ఇద్దరూ ఇప్పుడు సాఫ్ట్ వేర్ డెవలపర్లే. అక్కడే ఉద్యోగాలు కూడా చేశారు. వీసాల గడువు ముగిసిన తరువాత ఇక్కడికి వచ్చిన ఈ జంట తమకు హెచ్-1బీ వీసాలు దక్కాలని మొక్కేందుకు మరోసారి చిలుకూరు వెళ్లారు. సంవత్సరానికి దాదాపు లక్ష మంది విదేశీ ఉద్యోగులను అమెరికాకు ఆహ్వానించే హెచ్-1బీ వీసాల విధానాన్ని మరింత కఠినం చేయాలని ట్రంప్ భావిస్తుండటంపై ఒక వైపు ఆందోళన వ్యక్తం చేస్తూనే మరోవైపు నైపుణ్యముంటే ఉద్యోగాలకు కొదవేంటని ప్రశ్నిస్తున్నారు ఈ హైదరాబాదీ టెక్కీలు. అమెరికన్లకు అధికంగా ఉద్యోగాలు దక్కడమే లక్ష్యంగా ట్రంప్, ఆయన అటార్నీ జనరల్ జెఫ్ సీసన్స్ లు కీలక నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఇంకా అమలు కానప్పటికీ, హెచ్-1బీ వీసాల జారీ కఠినం కాక తప్పదని తెలుస్తోంది. 2000 సంవత్సరంతో పోలిస్తే అమెరికా జారీ చేస్తున్న వీసాల సంఖ్య సగానికి పైగా తగ్గిపోయిన ఈ పరిస్థితుల్లో అమెరికా వెళ్లాలన్న కల, హెచ్-1బీ వీసా సాధించాలన్న కోరిక అంత తేలికగా తీరకపోవచ్చు. మరిక మన వీసాల బాలాజీ ఎంతమందిని ఆశీర్వదిస్తాడో వేచి చూడాలి. ఆయనకు ఇది అగ్ని పరీక్ష లాంటిదే అని చెప్పాలి. భక్తుల కోరికను ఎలా నెరవేరుస్తాడో వేచి చూడాలి.

Share.

Comments are closed.