పనిలేకపోతే చెడు ఆలోచనలు : చంద్రబాబు

0

jhanmabhoomi2_apduniaముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నెల్లూరు జిల్లాలో  పర్యటించారు. కార్యక్రమంలో భాగంగా మంగళవారం చంద్రబాబు జిల్లాలోని చెన్నూరులో జన్మభూమి కార్యక్రమంలో భాగంగా ఏర్పాటుచేసిన స్టాల్స్‌నుసందర్శించారు. కాగా ఈ స్టాల్స్‌ను వ్యవసాయం, మత్స్యసహా 25 శాఖలు కలిసి ఏర్పాటు చేశాయి. . పరిసరాలు పరిశుభ్రంగా లేకపోతే రోగాలు వస్తాయని చంద్రబాబు తెలిపారు. మనిషికి మొదటి విరోధినాలుకేనని సీఎం చంద్రబాబు అన్నారు. పనిలేకపోతే చెడు ఆలోచనలు వస్తాయన్నారు. ఆహారపుఅలవాట్లు, ఆలోచనా విధానం మారాలని చంద్రబాబు చెప్పారు. మనిషి అవసరాలకు డబ్బు కావాలి కానీ.. కేవలం డబ్బుతోనే ఆనందం రాదని సీఎం చంద్రబాబు తెలిపారు. నచ్చిన పనిచేస్తే మానసిక ఆనందంతోపాటు ఉల్లాసం కలుగుతుందన్నారు. ఈ జన్మభూమి కార్యక్రమంలో మంత్రులు నారాయణ, శిద్దా రాఘవరావు, జిల్లా అధ్యక్షుడు బీదా రవిచంద్ర పాల్గొన్నారు

Share.

Comments are closed.