ఏపీ సర్వర్ చాలా పటిష్ఠమైంది.. దాన్ని ఎవరూ హ్యాక్ చేయలేరు

0

ap cm_apduniaఏపీ ఆన్ లైన్ సేవలు చాలా పటిష్ఠమైనవని, దాన్ని ఎవరూ హ్యాక్ చేయలేరని, ఒకవేళ ఎవరైనా చేసినా దానిని ఎలా పరిష్కరించాలో తమకు తెలుసునని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. ఫైబర్ గ్రిడ్ ద్వారా డిజిటలైజ్ అయిన తొలి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని ఆయన తెలిపారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ డిజిటలైజేషన్ దిశగా రాష్ట్రం వడివడిగా అడుగులు వేస్తోందని చెప్పారు. ఏపీలో కరెన్సీ వినియోగం తగ్గించే చర్యలను విజయవంతంగా చేపట్టామని అన్నారు. రాష్ట్ర ప్రజలు కేవలం 20 శాతం కరెన్సీని వినియోగించాలని, ఆన్ లైన్, మొబైల్ బ్యాంకింగ్ దిశగా కదలాలని అన్నారు. ఆన్ లైన్ సేవలు ఏపీలో అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు.

Share.

Comments are closed.