టిడిపి భయపడే పార్టీ కాదు

గురువారం శ్రీకాకుళంలో నిర్వహించిన ఏరువాక కార్యక్రమంలో ఎపి సిఎం నారా చంద్రబాబు నాయుడు తలపాగాతో, పంచెకట్టు వస్త్రధారణతో పాల్గొన్నారు. సభలో ఆయన మాట్లాడుతూ… కేంద్ర ప్రభుత్వం తమకు సహకరించడం లేదన్నారు. నాలుగేళ్లు ఓపికపట్టామని, కేంద్రం తీరులో మార్పు రాకపోవటంతో తిరుగుబాటు చేశామని చెప్పారు. కేంద్రం విభజన హామీలను అమలుచేయడం లేదన్నారు. బిజెపి నమ్మించి మోసం చేసిందని విమర్శించారు. కేసులకు భయపడి వైసిపి కేంద్రంతో లాలూచీ పడిందని ఎద్దేవా చేశారు. ఉత్తరాంధ్రలో తెలంగాణ తరహా ఉద్యమం వస్తుందని పవన్‌ అంటున్నాడు కాని ఉత్తరాంధ్ర టిడిపికి కంచు కోటని స్పష్టం చేశారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి టిడిపి హయాంలోనే జరిగిందన్నారు. సొంత జిల్లాకు ఉక్కు కర్మాగారం అడగలేని దుస్థితి వైసిపిదని విమర్శించారు. టిడిపి భయపడే పార్టీ కాదని, కాంగెస్‌లో ఉండి రాష్ట్రాన్ని ముంచిన నేతలే ఇప్పుడు బిజెపిలో ఉన్నారని చెప్పారు. వైసిపి, జనసేన పార్టీలు బిజెపి నేతల అద్దె మైకులుగా మారాయని విమర్శించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP Facebook Auto Publish Powered By : XYZScripts.com