గిరిజనులతో చంద్రబాబు ముఖాముఖి

విశాఖ జిల్లా పాడేరు మండలం ఆడారిమెట్టలో జరిగిన గ్రామదర్శిని కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. గిరిజనులకు చంద్రబాబునాయుడు నగదు ప్రోత్సాహకాలు పంపిణీ చేశారు. ఆదివాసీ ప్రజలతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గర్భిణీలకు సామూహిక శ్రీమంతాలు నిర్వహించారు. అంగన్ వాడీ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ‘గిరి ప్రగతి’ వెబ్ సైట్, జీసీసీ ఉత్పత్తులను చంద్రబాబు ఆవిష్కరించారు. తరువాత అయన మాట్లాడుతూ మోదుకొండమ్మ అమ్మవారిని దర్శించుకోవడం తనకు సంతోషంగా ఉందని, గిరిజనులకు భూమి పట్టాలు ఇస్తున్న ఘనత తెలుగుదేశం ప్రభుత్వానిదేనని అన్నారు. కేవలం భూములు ఇవ్వడమే కాకుండా సాగును లాభసాటిగా మారుస్తామని, గిరిజన ప్రాంతంలో పండించే జీడిపప్పుకు ప్రాధాన్యత తీసుకువస్తామని హామీ ఇచ్చారు. గిరిజన పిల్లలను విద్య కోసం విదేశాలకు పంపుతున్నామని, ఏపీలో ఎప్పుడూ లేనంత అభివృద్ధి, సంక్షేమం ఈ నాలుగేళ్లలో జరిగిందని చంద్రబాబు చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP Facebook Auto Publish Powered By : XYZScripts.com