ఎలా అభివృద్ధి చేయాలో ప్రతిపక్షాలకేం తెలుసు?

0

ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు బుధవారం రాజధాని పర్యటన చేశారు. శాశ్వత సచివాలయ నిర్మాణ పనులు, జ్యూడిషీయల్ కాంప్లెక్స్ పరిధిలో నిర్మిస్తున్న సిటీ సివిల్ కోర్ట్ కాంప్లెక్స్ పనులను సీఎం పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ… హైదరాబాద్ ఇప్పుడో బంగారు బాతు. హైదరాబాద్ ను అభివృద్ధి చేసి ఇస్తే.. సీఎం కేసీఆర్ నన్ను అదే పనిగా విమర్శిస్తున్నారని మండిపడ్డారు. రాజధానిలో జరుగుతోన్న అభివృద్ధి చూసి దివాళ తీసిన పార్టీలు ఓర్చుకోలేకపోతున్నాయి.. ఆ పార్టీలకు పరిపాలన చేత కాదు, అభివృద్ధి చేస్తే ఓర్వలేకపోతున్నారన్నారు. ఎలా అభివృద్ధి చేయాలో ప్రతిపక్షాలకేం తెలుసు?.. దొంగ లెక్కలు ఎలా రాయాలో మాత్రమే ప్రతిపక్షాలకు తెలుసని ఆయన విమర్శించారు. అమరావతిలో జర్నలిస్టులకు భూమిని కేటాయిస్తూ వచ్చే కేబినేట్ లో నిర్ణయం తీసుకుంటాం. ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా 2వేల మంది విలేకర్లకు గృహ సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నాం అని చంద్రబాబు తెలిపారు.

Share.

About Author

Leave A Reply