జీఎస్టీ కౌన్సిల్ చైర్మన్కు మంత్రి యనమల రామకృష్ణుడు లేఖ

జీఎస్టీ కౌన్సిల్ చైర్మన్ కు రాష్ట్ర ఆర్ధికమంత్రి యనమల రామకృష్ణుడు లేఖ రాసారు. రాష్ట్రంలో వినియోగదారులు మరియు వర్తక వాణిజ్యాలకు జీఎస్టీ భారం తగ్గించాలని కోరారు. అలాగే, చింతపండు,

చేనేత వస్త్రాలు, చిలపనూలు, యూహెచ్టీ పాలపై పన్ను ఎత్తివేయాలన్నారు. కొండపల్లి, ఏటికొప్పాక, కాళహస్తి వస్త్ర పెయింటింగ్లపై జీఎస్టీ ఎత్తివేయాలని లేఖలో పేర్కొన్నారు. వికలాంగుల పరికరాలు,

మత్స్యకారుల వలలకు పన్ను మినహాయించాలని మంత్రి కోరారు. నాపరాళ్లపై పన్ను 5 నుంచి 12 శాతానికి పెంచే ప్రతిపాదనను విరమించాలన్నారు. ట్రాక్టర్లు, ట్రాక్టర్ టైర్లు, సినిమా టికెట్లు,

బిస్కెట్లు, చిన్న, మధ్య తరహా పరిశ్రమల యంత్రాలపై గణనీయంగా పన్ను తగ్గించాలన్నారు. అలాగే గిరిజన కార్పొరేషన్, టీటీడీని జీఎస్టీ పరిధి నుంచి తొలగించాలని మంత్రి యనమల లేఖలో కోరారు.

కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP Facebook Auto Publish Powered By : XYZScripts.com