కేంద్రానికి కరువు నివేదికలు

రాష్ట్రంలో ఎనిమిది జిల్లాలో కరువు పరిస్థితులు నెలకొన్నాయి. కడపలో తీవ్రమైన దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నాయి. కరువుపై కేంద్రానికి నివేదికలు పంపుతున్నామని వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ అన్నారు. బుధవారం నాడు వర్షాభావ పరిస్థితులు పై మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్ ఆదినారాయణ రెడ్డి స్థానిక ఆర్ అండ్ బి అతిధి గృహంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. సోమిరెడ్డి మాట్లాడుతూ కరువు నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటల సాగు కోసం రైతులకు ఉచితంగా విత్తనాలు ఇస్తున్నాం. ఎండుతున్న పంటలను కాపాడేందుకు రేయిన్ గన్స్ వినియోగిస్తున్నామని అన్నారు. కరువు పరిస్థితుల దృష్ట్యా సెప్టెంబర్లో ప్రాజెక్టులకు నీళ్లు రావాల్సి ఉన్నా ఆగస్టులోనే వదిలేేలా చర్యలు చేపడుతున్నాం. కరువు పరిస్థితులున్నా జిల్లాలోని రిజర్వాయర్లలో 19 టీఎంసీల నీరు నిల్వ ఉంది. గండికోట భూసేకరణ సమస్యలను కూడా పరిష్కరిస్తాం. కరువు పనులను నీరుచెట్టు పనులకు అనుసంధానం చేయడం వల్ల భూగర్భ జలాలు అడుగంటి కుండా చూశామని అన్నారు. పశుగ్రాసం కొరత దృష్టా 21 లక్షలతొ గోకులాలను ఏర్పాటుచేస్తున్నాం. రైతులు ముందుకు వస్తే ఊరూరా మెగా పశుగ్రాస కేంద్రాలను ఏర్పాటు చేస్తాం. కేసీ కెనాల్ కు నీటిని విడుదల చేశాం మరో రెండు రోజుల్లో జిల్లాకు రానున్నాయి. పంటల బీమా కింద జిల్లాకు 58 కోట్లు మంజూరు అయ్యిందని మంత్రి వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *