15 కోట్లతో గురుకులాలకు సీసీ కెమెరాలు

గురుకులంలో అధునాతన పద్ధతిలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించాయి. గురుకులాల సంఖ్య పెరగటంతో అక్కడక్కడా అవకతవకలు చోటుచేసుకుంటున్నాయి. దీంతో వాటిని నియంత్రించేందుకు నిఘా వ్యవస్థను త్వరలో అందుబాటులోకి తేనున్నాయఒక్కో గురుకుల పాఠశాలలో కనిష్టంగా రూ.1.5 లక్షలతో డిజిటల్‌ సీసీ కెమెరాలు, స్టోరేజీ సిస్టం ఏర్పాటు కు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 565 గురుకుల పాఠశాలలున్నాయి. వీటిలో సీసీ కెమెరాల వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు.ఈ వ్యవస్థను పాఠశాల స్థాయిలో ఆపరేటింగ్‌ చేసేలా వెసులుబాటు ఉన్నప్పటికీ.. నిర్వహణ తీరును పరిశీలించేందుకు గురుకుల సొసైటీలో ప్రత్యేకంగా కమాండ్‌ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నారు. అన్ని గురుకుల పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కాలేజీల్లో వీటి ఏర్పాటుకు రూ.15 కోట్లు ఖర్చు చేసేలా సొసైటీలు సుముఖత వ్యక్తం చేయడంతో అధికారులు ప్రతిపాదనలు తయారు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP Facebook Auto Publish Powered By : XYZScripts.com