నెల్లూరు జిల్లాలో దారుణం

నెల్లూరు జిల్లా రాపూరులో దారుణం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి బంధువులు ఏకంగా పోలీస్‌స్టేషన్‌పైనే దాడి చేసి ఎస్సై, ఇద్దరు కానిస్టేబుల్‌ను చితకబాదారు. ఈ ఘటనలో

ఎస్సై లక్ష్మణ్‌ రావు, మరో ఇద్దరు కానిస్టేబుళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన పోలీసు అధికారులను సహచరులు సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స

అందిస్తున్నారు. ఎస్సైకి తలకు తీవ్ర గాయం కావడంతో వైద్యులు గాయానికి 8 కుట్లు వేశారు. ఓ కేసు విషయంలో వ్యక్తిని స్టేషన్‌కు తీసుకొచ్చి చేయి చేసుకున్నాడనే

కోపంతో అతడి సంబంధీకులు ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. అడ్డుకోవడానికి ప్రయత్నించిన కానిస్టేబుళ్లపై కూడా విచక్షణాతహితంగా దాడి చేశారు. దాడి ప్రమాదాన్ని

గుర్తించిన ఎస్సై లక్ష్మణరావు సెల్ లోపలికి వెళ్లగా.. ఆయణ్ని బయటకు లాక్కొచ్చి మరీ కొట్టారు. ఎస్సై దుస్తులు చింపేసి చెప్పులతో తీవ్రంగా చితకబాదారు. రవి అనే వ్యక్తి

పిచ్చయ్య, లక్షమ్మ, కనకమ్మ అనే ముగ్గురు వ్యక్తులపై నగదు లావాదేవీలకు సంబంధించి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ అంశంపై విచారణ చేపట్టిన ఎస్సై ఆరోపణ

ఎదుర్కొంటున్న వ్యక్తులను స్టేషన్‌కు పిలిపించి ప్రశ్నించారు. ఈ క్రమంలో ఓ వ్యక్తిపై చేయిచేసుకున్నట్లు తెలిసింది. మహిళలని కూడా చూడకుండా ఎస్సై దూషించారని

వారు ఆరోపిస్తున్నారు. తమవారిపై ఎస్సై చేయిచేసుకున్నారనే వార్తతో వారి బంధువులు పోలీస్ స్టేషన్‌కు దూసుకొచ్చారు. ఎస్సై లక్ష్మణరావుతో వాగ్వాదానికి దిగారు.

వాదన కొనసాగుతుండగానే మరికొంత మంది వచ్చారు. అందరూ కలిసి ఎస్సైని చితకబాదారు. నెల్లూరు జిల్లా రావూరు పిఎస్ పరిధిలోని పోలీస్ స్టేషన్ ఎస్సై లక్ష్మణ రావు

డ్రంకన్ డ్రైవ్ కేసులో రమేష్ అనే యువకుడిని కొట్టారన్నది సంఘటనలో దాడికి దిగిన బృందం ఆరోపణ. విషయం బంధువులకు స్నేహితులకు తెలియడంతో వారంతా

కట్టలు తెగిన ఆవేశంతో మూకుమ్ముడిగా పోలీస్ స్టేషన్ పై దండయాత్రకు వెళ్ళి ఎసై ని కానిస్టేబుల్ ను చితకొట్టేశారు. ఈ సంఘటనతో ఉలిక్కిపడిన పోలీస్ యంత్రాంగం

అప్రత్తమైంది. దాడికి పాల్పడిన ప్రతిఒక్కరిపై చర్యలు తీసుకోవడానికి సమాయత్తమైంది. దీనిపై విచారణ జరిపి దోషులను గుర్తిస్తామని అధికారులు ప్రకటించారు.ఎస్సైని,

కానిస్టేబుల్స్ ను బాదేసిన ఈ సంఘటన సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. దాడి సమయంలో ఎవరో వీడియో తీసి పెట్టడంతో ఈ అంశం సంచలనంగా మారింది.

సరిగ్గా ఇప్పుడు ఈ వీడియోనే పోలీసులకు మరోరకంగా ఆయుధం కాబోతుంది. దాడిలో పాల్గొన్న వారిని గుర్తించి ఆధారాలతో వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవడానికి

దోహదం చేయనుంది. మరోవైపు ఎస్సై వైఖరి కూడా వ్యవహారం ఇంతవరకు రావడానికి కారణం అని మరికొందరు అంటున్నారు. ఇదిలా ఉండగా దాడిలో గాయపడి

ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎస్సై కానిస్టేబుల్స్ కి ప్రాణాపాయం లేదని వారు కోలుకుంటున్నట్లు పోలీస్ వర్గాల సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *