ఆరంభదశలోని బ్రెస్ట్ కేన్సర్ రోగులు కీమోథెరపీ బాధను తప్పించుకోవచ్చు నూతన ప్రిసిషియన్ మెడిసిన్ విధానంతో మంది బ్రెస్ట్ కేన్సర్ రోగులు అధ్యయనంలో వెల్లడి

ఆరంభదశలోని బ్రెస్ట్ కేన్సర్ రోగుల్లో కీమోథెరపీ పొందుతున్న వారిలో సుమారు 70% మంది ఎలాంటి ప్రయోజనం పొందడం లేదని, 30 శాతం మంది మహిళల్లో మాత్రం వారు పొందే కీమో థెరపీ ప్రయోజనం వారి జీవితాన్ని కాపాడేది కావచ్చునని ఆంకోటైప్ డిఎక్స్ బ్రెస్ట్ రికరెన్స్ స్కోర్ టెస్ట్ నిస్సందే హంగా గుర్తించినట్లుగా ట్రయల్ అసైనింగ్ ఇండివిడ్యువలైజ్డ్ ఆప్షన్స్ ఫర్ ట్రీట్ మెంట్ అధ్యయనంలో సంచలన ఫలితం వెల్లడైంది.ఈ అధ్యయనం ఇప్పటి వరకూ ఎన్నడూ జరగనంత అతిపెద్ద బ్రెస్ట్ కేన్సర్ ట్రీట్ మెంట్ ట్రయల్. న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్ లో జూన్ లో ప్రచురితమైంది. నేషనల్ ఇనిస్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్ లో భాగమైన యునైటెడ్ స్టేట్స్ నేషనల్ కేన్సర్ ఇనిస్టిట్యూట్ (ఎన్ సిఐ) ఈ అధ్యయనానికి అండగా నిలిచింది. ఇసిఒజి – ఎసి ఆర్ఐఎన్ కేన్సర్ రీసెర్చ్ గ్రూప్ ఈ అధ్యయనానికి రూపకల్పన చేసి సారథ్యం వహించింది.ఈ సందర్భంగా హైదరాబాద్ లోని అపోలో హెల్త్ సిటీ సీనియర్ కన్సల్టెంట్ – క్లినికల్ ఆంకాలజీ & రేడియోథెరపీ – డాక్టర్ విజయ్ ఆనంద్ రెడ్డి మాట్లాడుతూ, ‘‘అధ్యయనం ఫలితాలతో నేనెంతగానో ఏకీభవిస్తాను. చాలా కేసుల్లో హార్మోనల్ థెరపీ సరిపోతుందని నేను విశ్వసిస్తాను. కీమోథెరపీ మరింత విషతుల్యమైంది మరియు అతి తక్కు వ ప్రయోజనాలతో కూడుకున్నది. అనవసరంగా కీమోథెరపీ చేయకుండా ఉండడంలో ఈ అధ్యయన ఫలితాలు తప్పకుండా తోడ్పడుతాయి. ఇది వైద్యులు, రోగులకు ఉపశమనం కలిగించే అంశం’’ అని అన్నారు.భారతదేశంలో మహిళల్లో బ్రెస్ట్ కేన్సర్ అనేది అత్యంత సాధారణ కేన్సర్. మహిళల్లో కానవచ్చే అన్ని కేన్సర్ లలో 27% ఇదే. 100,000 మందిలో 25.8 రేటు అనేది కొన్ని అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే తక్కువే అయిన ప్పటికీ, మరణాల రేటు (100,000కు 12.7) మాత్రం పాశ్చాత్యదేశాలతో పోల్చదగినదిగా ఉంది. బ్రెస్ట్ కేన్సర్ కు సంబంధించి భారతదేశానికి చెందిన ఆరు ముఖ్యమైన కేన్సర్ రిజిష్టర్స్ నుంచి సేకరించిన ఇన్సిడెంట్ రేట్లపై డేటా ప్రకారం, బ్రెస్ట్కేన్సర్ చోటు చేసుకుంటున్న ఉదంతాల్లో వార్షిక పెరుగుదల శాతం 0.46- 2.56 % దాకా ఉంది.ప్రపంచవ్యాప్తంగా బ్రెస్ట్ కేన్సర్ నిర్ధారణ అయిన వారిలో అత్యధికులు హార్మోన్–పాజిటివ్, హెచ్ఇఆర్ 2-నెగెటివ్, నోడ్-నెగెటివ్ కేన్సర్ కలిగి ఉన్నవారే. ఈ రోగుల్లో సుమారు 70 % మందిని కీమో థెరపీ నుంచి మినహాయించ వచ్చునని అధ్యయనం సూచిస్తోంది. ఈ అధ్యయనం ప్రకారం, బ్రెస్ట్ రికరెన్స్ స్కోర్ ఫలితాలు 0 నుంచి 25 వరకు ఉన్న వారిలో 50 ఏళ్ళు పైబడిన వారిని, అదే విధంగా ఈ స్కోర్ ఫలితాలు 0 నుంచి 15 ఉన్న వారి లో 50 ఏళ్ళ లోపు వారిని మినహాయించవచ్చు.ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఆరంభదశ బ్రెస్ట్ కేన్సర్ రోగుల్లో 30 శాతం మంది కీమో థెరపీ ద్వారా ప్రయోజ నం పొందగలుగుతున్నారు. వీరిలో బ్రెస్ట్ రికరెన్స్ స్కోర్ ఫలితాలు 26 నుంచి 100 దాకా ఉన్న అన్ని వయస్సు ల మహిళలు ఉన్నారు. 50 ఏళ్ళ లోపు మహిళల్లో, బ్రెస్ట్ రికరెన్స్ స్కోర్ ఫలితాలు 16 నుంచి 20 దాకా ఉ న్నవారిలో 2 శాతం మంది మాత్రమే కీమో థెరపీ ద్వారా ప్రయోజనం పొందగలుగుతున్నారు. స్కోర్ 25, అంత కు మించి చేరుకుంటున్న కొద్దీ ఇలాంటి వారిలో ప్రయోజనం పొందే వారి సంఖ్య కూడా అధికమవుతోంది. ఆంకో టైప్ డిఎక్స్ టెస్ట్ మాత్రమే అందించే ఒక నూతన స్థాయి మాత్రమే తక్కువ వయస్సు ఉన్న రోగులకు కీమోథెరపీ ద్వారా ప్రయోజనం పొందగలుగుతారని ఈ ముఖ్యమైన ఫలితం తెలియజేస్తోంది.ఈ సందర్భంగా మెడిలింక్స్ ఇన్ కార్పొరేషన్ సీఈఓ శ్రీ ప్రసాద్ వైద్య మాట్లాడుతూ, ల్లడించిన ఫలి తాలు వేలాది మహిళలు విషతుల్యమైన కీమోథెరపీ పొందడం నుంచి పక్కకు తప్పిస్తాయి. నిజానికి అది వారికే మీ ప్రయోజనం చేకూర్చకపోవచ్చు. కీమోథెరపీ ద్వారా ప్రయోజనం పొందగల సరైన రోగులను గుర్తించడం, కీ మో థెరపీ ద్వారా ప్రయోజనం పొందలేని వారిని ఈ థెరపీకి, దాని విషపూరిత ఇతర దుష్ఫలితాలకు దూరంగా ఉంచడం, వ్యక్తిగతీ చికిత్సను అందించడం అనేది వైద్యరంగంలో ఒక సంచలనాత్మక ముందడుగు. భారత దేశం లో జినోమిక్ హెల్త్ కు ఏకైక వాణిజ్య ప్రతినిధిగా మేము భారతదేశంలో సంరక్షణ ప్రమాణాల్లో మార్పులు తీసుకు రావాలని ఆశిస్తున్నాం’’ అని అన్నారు.ట్రయల్ లో ప్రపంచవ్యాప్తంగా 6 దేశాల నుంచి బ్రెస్ట్ కేన్సర్ నుంచి బాధపడుతున్న 10,273 మంది మహిళలను నమోదు చేసుకున్నారు. అది ఆంకోటైప్ డిఎక్స్ బ్రెస్ట్ రికరెన్స్ స్కోర్ టెస్ట్ ను ఉపయోగించింది. వారికి అత్యంత గా సరిపోయే మరియు ప్రభావపూరిత పోస్ట్–ఆపరేటివ్ చికిత్సను అందించేందుకు వీలుగా ఆరంభ దశలో ఉన్న వారిని, హెచ్ ఆర్- పాజిటివ్, హెచ్ఇఆర్–నెగెటివ్, యాక్జిలరీ లింఫ్ నోడ్–నెగెటివ్ బ్రెస్ట కేన్సర్ మహిళలను గుర్తిం చేందుకు, బ్రెస్ట్ కేన్సర్ రికరెన్స్ తో ముడిపడిన 21 జన్యువుల ఎక్స్ ప్రెషన్ ను ఇది మదింపు వేస్తుంది. లో పాల్గొన్న వారిలో బ్రెస్ట్ రికరెన్స్ స్కోర్ ఫలితాలు 0 నుంచి 10 వరకు ఉన్న వారికి, ఎన్ఎస్ఏబీపీ బి-20 అధ్యయనం నుంచి పొందిన ఫలితాల ఆధారంగా ఎండోక్రిన్ థెరపీ మాత్రమే ఇచ్చారు. కీమోథెరపీ ప్రయోజ నానికి ఎలాంటి అవకాశం కనబర్చలేదు. స్కోర్ ఫలితాలు 26 నుంచి 100 వరకు ఉన్న వారికి, ఎన్ఎస్ఏబీపీ బి-20 అధ్యయనం నుంచి పొందిన ఫలితాల ఆధారంగా, కీమోథెరపీతో పాటుగా ఎండోక్రిన్ థెరపీ కూడా అందిం చారు. కీమోథెరపీ యొక్క ప్రయోజనాన్ని 20 శాతం గొప్పగా ఇది అందించింది.రికరెన్స్ కు సంబంధించి ఇంటర్మీడియెట్ రిస్క్ ను ఎదుర్కొంటున్న మహిళల్లో కీమోథెరపీ ప్రభావాన్ని మరింత కచ్చితంగా నిర్ధారించేందుకు, ఆంకోటైప్ డిఎక్స్ బ్రెస్ట్ రికరెన్స్ స్కోర్ ఫలితాలు 11నుంచి 25 వరకు ఉన్న 6,711 మంది మహిళల లో ప్రైమరీ స్టడీ గ్రూప్)కు రాండమ్ గా కీమోథెరపీతో మరియు కీమోథెరపీ లేకుండా ఎండోక్రిన్ థెరపీ ఇచ్చారు. ఈ ర్యాండమైజ్డ్ రోగుల్లో మూడింట రెండు వంతుల మందిలో నమోదైన అం దరు రోగుల నుంచి ఉన్నారు. పరిశోధకులు వీరిని సగటున తొమ్మిదేళ్ళ పాటు పరిశీలించారు.హైదరాబాద్ లోని ఒమెగా హాస్పిటల్స్ కు చెందిన సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ పి.ఎస్. ద త్తాత్రేయ ఈ సందర్భంగా మాట్లాడుతూ, ‘‘ఇది రోగుల చక్కటి ప్రాతినిథ్యంతో కూడిన ఎంతో తెలివిగా నిర్వహిం చిన అధ్యయనం. ఒకే ఒక్క లోపం ఏమిటంటే, ఇదెంతో ఖరీదైన పరీక్ష. వ్యయం సుమారుగా రూ.2.75 లక్షలు కావడం భారతదేశంలో దీనిని ఉపయోగించుకోవడాన్ని తక్కువ చేస్తుంది. కీమో థెరపీతో ప్రయోజనం పొందగల హైరిస్క్ రోగులను గుర్తించడంలో ఆంకోటైప్ డిఎక్స్ టెస్ట్ తోడ్పడుతుంది. అత్యంత సాధారణమైన బ్రెస్ట్ కేన్సర్ లో 70% వారికి కీమోథెరపీతో ప్రయోజనం ఉండడం లేదని అధ్యయనం ఫలితాలు వెల్లడించాయి. ఇలాం టి రోగుల్లో 90% మందికి వ్యాధిని తగ్గించేందుకు కొద్దిపాటి ఇతర దుష్ఫలితాలతో ఉండే హార్మోనల్ థెరపీ సరిపో తుంది. ఈ పరీక్ష ద్వారా కీమోథెరపీ ఎవరికి అవసరమన్న విషయం స్పష్టంగా తెలుస్తుంది. కీమోథెరపీ మరి యు దాని దుష్ఫలితాలను ఎంతో మంది రోగులకు తప్పించడంలో ఇది తోడ్పడుతుంది’’ అని అన్నారు.ప్రఖ్యాత ఆంకాలజిస్టు, పద్మభూషణ్ గ్రహీత డాక్టర్ సురేశ్ అద్వానీ మాట్లాడుతూ, ‘‘నేడు వ్యక్తిగతీకృత మెడిసిన్ అనేది నిర్దిష్ట వర్గానికి చెందిన రోగులకు కీమోథెరపీని తప్పించేందుకు మనకు వీలు కల్పిస్తోంది. కీమో థెరపీ ఎవరికి అవసరం లేదో, ఎవరికి అవసరం ఉన్నదో మనం ఎంచుకోగలుగుతాం’’ అని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP Facebook Auto Publish Powered By : XYZScripts.com