భవానీలతో  కళకళలాడుతున్న ఇంద్రకీలాద్రి

0
vijayawada-durgamma-apduniaభవాని భక్తుల తో  విజయవాడ నగరం ఎరుపెక్కింది. ఇవాళ్టి నుంచి భవాని భక్తుల దీక్షవిరమణ కార్యక్రమం ప్రారంభం కానుంది దీంతో  నగరం అంతా భవాని భక్తల జైభవాని నాదాలతో మారు మ్రోగుతుంది.గతంలో కంటే భక్తలకు పూర్తి స్దాయి ఏర్పాట్లకు అటు ప్రభుత్వం ఇటు దేవాలయ అదికారులు సన్నద్దం అయ్యారు.భవాని భక్తల కోసం కనక దుర్గమ్మ దేవాలయం మరింత శోభాయమానంగా రూపుదిద్దుకుంది.మూడు వేల మంది అదనపు పోలీస్ భలగాలతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.ఎటువంటి అపోహాలు నమ్మవద్దని ప్రజలు పోలీస్ హెల్ప్ లైన్ ని వినియోగించుకోవాలని సూచిస్తున్నారు.ప్రతి ఒక్క పోలీస్ సేవలను భ్తకులు వినియోగించుకోవచ్చని పోలీస్ అదికారులు చెపుతున్నారు.గతంలో జరిగిన పొరపాట్లు ప్రస్తుతం రిపీట్ కాకుండా అన్నిరకాల ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నట్టు దేవాలయ ఈవో సూర్యకుమారి చెపుతున్నారు.ఎప్పుడూ లేని విదంగా భవాని భక్తుల కోసం ప్రత్యేకంగా ప్రసాదం సైతం తయారు చేయించి సిద్దంగా ఉంచినట్టు తెలిపారు.రోజుకు 45వేల మందికి అన్నదాన సదుపాయం కల్పించినట్టు ఈవో సూర్యకుమారి తెలిపారు.లక్షలాదిగా తరలి వస్తున్న భవానిలతో నగరం అంతా ఎరుపెక్కనుంది.అమ్మ భవానిల జయజయ ద్వానాలతో రాజదాని ప్రాంతం అంతా భక్తి పారవశంలో నిండిపోనుంది..
Share.

Comments are closed.