పొదిలిలో కుక్కల బెడద

ప్రకాశం జిల్లా పొదిలి పట్టణంలో గ్రామ సింహాలు బెంబేలెత్తిస్తున్నాయి. కుక్కల నియంత్రణలో చర్యలు తీసుకోకుండా అధికారులు చోద్యం చూస్తున్నారని ప్రజలు వాపోతున్నారు. ఏ వీధిలో చూసిన శునకాలు గుంపులు గుంపులుగా సంచరిస్తున్నాయి. చిన్నా పెద్దా తేడా లేకుండా దాడి చేస్తూ గాయ పరుస్తున్నాయి. సాయంత్రం వేళ అయితే చాలు వాటిదే ఇష్టారాజ్యం అన్నట్లు వ్యవహరిస్తాయి. ఇక రాత్రి వేళలో వాహన చోదకుల వెంటబడి తరుముతున్నాయి. కుక్కల బారీ నుండి తప్పించుకునే క్రమంలో ద్విచక్ర వాహన దారులు ప్రమాదాల భారిన పడుతున్నారు. పొదిలి పట్టణంలోని పడమటిపాలెం, నవాబుమిట్ట, తూర్పుపాలెం, మసీద్ తోట, నిర్మల కాన్వెంట్, కాలేజ్ రోడ్ మొదలగు ప్రదాన ప్రాంతాల్లో సమస్య మరి తీవ్రంగా ఉంది. రోజు రోజుకు పిచ్చి క్కల బారిన పడ్డ వారు ఎక్కువవుతున్నారు. గురువారం కుడా ముగ్గురిని గాయ పరచడంతో ప్రజలు భయాందోళనకు గురి అవుతున్నారు. అధికారులు తమ సమస్యను పట్టించుకోవాలని ఎన్ని సార్లు అధికారులకు తెలియజేసినా స్పందించటం లేదని స్థానికులు వాపోతున్నారు ఇప్పటి వరకు ఈ సంవత్సరంలో మూడు వందలకు పైగా కుక్కల దాడులు నమోదయ్యాయని డాక్టర్లు చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP Facebook Auto Publish Powered By : XYZScripts.com