శీతాకాలంలో టమోటా ఉపయోగాలు

0

చలికాలంలో జీర్ణశక్తి మందగించి.. ఆకలి వేయకపోవడం సహజం. పీచుపదార్థాలను తీసుకున్నప్పటికీ కడుపులో అసౌకర్యంగా ఉంటుంది. ఇలాంటప్పుడు మీ రోజు వారీ ఆహారంలో టొమోటోల మోతాదు పెంచండి. వీలైతే సూప్‌, లేదంటే కూరల ద్వారా వీటిని తీసుకుంటే మంచిది. ఎందుకంటే.. టొమాటోల్లో విటమిన్‌ ఎ ఎక్కువ. కంటిచూపు మందగింపు సమస్యలు దరి చేరవు. వీటిలోని లైకోపిన్‌ క్యాన్సర్‌ను అడ్డుకుంటుంది. ఊపిరితిత్తులు, ఉదరం, ప్రొస్టేట్‌ క్యాన్సర్ల బారి నుంచి తప్పించుకోవచ్చు. టోమోటోలు రక్తప్రసరణ సాఫీగా సాగేందుకు దోహద పడతాయి. ఈ కూరగాయలోని కొన్ని రసాయనాలు బ్లడ్‌ క్లాటింగ్‌ జరగనివ్వవు. వీటన్నిటికంటే ముఖ్యమైన ప్రయోజనం – రోజుకు ఒక టొమాటో తింటే శరీరానికి సరిపడే విటమిన్‌ సి నలభైశాతం లభించడం. దీంతోపాటు విటమిన్‌ ఎ, పొటాషియం, ఇనుము అదనంగా లభిస్తుంది. హృద్రోగాలు రాకుండా కాపాడే గుణం టొమాటోకు ఉంది. రక్తంలోని చెడుకొవ్వును తొలగించి.. శుద్ధి చేస్తుంది. రక్తపునాళాల్లో పేరుకుపోయిన కొవ్వును తొలగించే స్వభావం టొమాటోలకు ఉంది. చలికాలంలో అరుగుదల తక్కువ. కాబట్టి వీలైనంత వరకు టొమాటోలతో చేసిన కూరల్ని తింటే జీర్ణశక్తి మెరుగవుతుంది. మలబద్ధక సమస్య తగ్గుతుంది. డయేరియా దరికి చేరదు. శరీరంలోని మలినాలను బయటికి పంపిస్తుంది.  శరీరానికి తక్షణ ఉల్లాసం కావాలంటే టొమాటో సూప్‌లు తాగాలి. రోజు సాయంత్రం పూట ఒక కప్పు సూప్‌ తాగితే మరుసటి రోజు ఉదయం మంచి ఆకలి వేస్తుంది.

Share.

Comments are closed.