ఒకరి వ్యసనం మరొకరి ప్రాణం తీసింది

0

car accident_apduniaపీకల దాకా తాగి డ్రైవింగ్ చేస్తూ నిండు ప్రాణాలను బలి తీసుకుంటున్నారు యువకులు. పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేసినా, కౌన్సెలింగ్ లు ఇచ్చినా, కేసులు పెట్టినా వీరి తీరు మారట్లేదు. మళ్ళీ ఇలాంటి ఘటనే హైదరాబాద్లో జరిగింది. ఒక ఎంటెక్ విద్యార్థి మందు, అమ్మాయిలకు బానిసై విలాసవంతమైన జీవితానికి అలవాటుపడ్డాడు. 2016 డిసెంబర్ 9న స్నేహితులతో కలిసి బయటకు వెళ్తున్నానని ఇంట్లో చెప్పి కార్ తీసుకుని వెళ్ళాడు. అర్ధరాత్రి వరకు పబ్ లో ఎంజాయ్ చేసి గర్ల్ ఫ్రెండ్ ను దించడానికి గచ్చిబౌలి వెళ్ళాడు. ఆ అమ్మాయిని గచ్చిబౌలిలోని ఐఎస్ బి రోడ్డులోని హిల్ వ్యూ అపార్టుమెంట్ లో దించి తిరుగు ప్రయాణంలో త్వరగా ఇంటికి చేరుకోవాలనే ఆదుర్ధాలో వేగంగా కార్ నడుపుతున్నాడు. ఈ నేపథ్యంలో రాయదుర్గం మాట టెంపుల్ వద్ద రోడ్ దాటుతున్న ఆర్మీ విశ్రాంత ఉద్యోగి దేవదానం (72) ను వేగంగా ఢీకొట్టి కార్ ఆపకుండా వెళ్ళిపోయాడు. దేవదానం అక్కడికక్కడే చనిపోయాడు. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా నిందితుడిని గుర్తించిన రాయదుర్గం పోలీసులు అరెస్ట్ చేసి, రాజేంద్రనగర్ కోర్టులో హాజరుపరచి చర్లపల్లి జైలుకు తరలించారు.

Share.

Comments are closed.