ప్రజలతో స్నేహంగా వుండాలి రాపిడ్ కాప్ శిక్షణ లో జిల్లా పోలీసులు

ప్రజలనుంచి, డయల్ 100 నుoడి పిర్యాదు అందినప్పుడు అ సంఘటన స్థలాన్ని కి వీలైనంత త్వరగా చేరుకోవాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే అన్నారు. రాపిడ్ కాప్ అప్లికేషన్ ద్వారా విధులలో ఉన్న సిబ్బంది చేయు విధానం అంత పారదర్శకంగా ఉంటుందని అన్నారు. ఏ సమయాన స్టేషన్ నుండి వెళ్లారు. ఏ సమయాన నేర స్థలానికి చేరుకున్నారు. ఏ వేగంతో , ఎంత సమయంలో ఏ దారిలో వెళ్లారు అను పకు విషయాలు అన్ని రికార్డ్ రూపంలో కంట్రోల్ రూమ్ లో నమోదు అవుతాయని అయన అన్నారు. గురువారం నాడు జిల్లా పోలీసు కార్యాలయం కాన్ఫరెన్స్ హాల్ లో జిల్లా లో పనిచేస్తున్న వివిధ పోలీస్ స్టేషన్లో వివిధ విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి రాపిడ్ కాప్ అప్లికేషను గూర్చి ఒకరోజు శిక్షణా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసారు. రాపిడ్ కాప్ పై ఉన్న సందేహాల ని డయల్ 100 సిబ్బంది, ఐటీ కోర్ సిబ్బంది నివృత్తి చేశారు. కార్యక్రమంలో ఎస్పీ మాట్లాడుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా అధునాతన టెక్నాలజీ, పోలీసుల విధులలో కీలకంగా మారుతూ వస్తుంది. అన్ని వర్గాల ప్రజలతో సన్నిహిత సంబంధాలను కొనసాగిస్తూ ఆయా ప్రాంతాల్లో పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలియజేయాలని సూచించారు. ఎక్కువగా రద్దీ ఉండే ప్రాంతాల్లో గస్తీని నిర్వహించాలన్నారు. అక్రమ కార్యకలాపాల పై నిఘా ఉంచాలన్నారు. విధి నిర్వహణ ముగిసిన అనంతరం విధుల్లో చేరే ఇతర బృందాలకు అక్కడి పరిస్థితులను వివరించాలని సూచించారు. గస్తీ నిర్వహిస్తున్న ప్రాంతాలలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ప్రతి కదలికను గమనించడంతో పాటు వారి గురించి తెలుసుకొవాలని తెలిపారు. ప్రతిరోజు విధి నిర్వహణకు సంబంధించిన నివేదికను సంబంధిత అధికారులకు అందజేయాలని తెలిపారు. సిబ్బంది తమ యూనిఫామ్ ను తప్పనిసరిగా ధరించాలని అన్నారు. సమర్థవంతమైన సేవలందిస్తున్న వారిని గుర్తించి వారికి ప్రోత్సాహకాలు అందజేస్తామన్నారు.ఈ శిక్షణ కార్యక్రమంలో అడిషనల్ ఎస్ పి రవీందర్ రావు, ఐటీ కోర్ టీమ్ ఇంచార్జి ఎస్ ఐ ఉపేందర్, కంట్రోల్ రూమ్ సిబ్బంది జిల్లా పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP Facebook Auto Publish Powered By : XYZScripts.com