వాజ్ పేయీ నివాసం వద్ద బారికేడ్లు ఏర్పాటు

ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న మాజీ ప్రధాని వాజ్‌పేయీ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. వాజ్‌పేయీ ఇంటి వద్ద పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఆ ప్రాంతంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. వీఐపీలు తిరిగే మార్గంలో కూడా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఆ పరిసర ప్రాంతాల్లో వాహనాలను దారి మళ్లిస్తున్నారు. బీజేపీ కేంద్ర కార్యాలయంలో ముఖ్యనేతలు సమావేశమయ్యారు. సమావేశంలో అమిత్‌షా, భూపేంద్ర యాదవ్, మురళీధర్‌రావు, ధర్మేంద్ర ప్రధాన్, జితేంద్ర సింగ్‌లు పాల్గొన్నారు. మధ్యాహ్నం 2 గంటలకు కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ మరో సారి ఎయిమ్స్‌కు చేరుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP Facebook Auto Publish Powered By : XYZScripts.com