ఉద్యోగాలను కల్పించేలా సంస్థల సదుపాయాలపై నిషేధం విధించాలి యూఎస్‌సీఐఎస్‌ డైరెక్టర్‌ ఎల్‌. ఫ్రాన్సిస్‌ సిస్నా

హెచ్‌-1బీ వీసాదారులతో ఉద్యోగాలను కల్పించేలా సంస్థలకు ఉన్న సదుపాయాలపై నిషేధం విధించడమే దీనికి సరైన మార్గమని అమెరికా పౌర, వలస సేవల విభాగం(యూఎస్‌సీఐఎస్‌) డైరెక్టర్‌ ఎల్‌. ఫ్రాన్సిస్‌ సిస్నా పేర్కొన్నారు. వలస సంస్కరణల వల్ల అమెరికా అవసరాలకు తగినట్లుగా అత్యంత ప్రతిభావంతులు, నిపుణులు దేశంలో ఉంటారని పేర్కొన్నారు. అమెరికన్లకు కాకుండా హెచ్‌-1బీ వీసాదారులతో ఉద్యోగాలను కల్పించేలా సంస్థలకు ఉన్న సదుపాయాలపై నిషేధం విధించడమే దీనికి సరైన మార్గమని ఆయన అభిప్రాయపడ్డారు.అమెరికాలో ఉద్యోగం చేయాలన్న యువత ఆశలపై నీళ్లు చల్లుతూ హెచ్‌-1బీ వీసా నిబంధలను ట్రంప్‌ ప్రభుత్వం కఠినతరం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అమెరికాలోని ఉద్యోగాలను, ఉద్యోగులను హెచ్‌-1బీ వీసాదారులతో భర్తీ చేయకుండా తీసుకొచ్చే బిల్లుకు యూఎస్‌ కాంగ్రెస్‌ ఆమోదం తెలిపితే చాలా సంతోషమని, అమెరికా పౌర, వలస సేవల విభాగం(యూఎస్‌సీఐఎస్‌) డైరెక్టర్‌ ఎల్‌. ఫ్రాన్సిస్‌ సిస్నా తెలిపారు.వాషింగ్టన్‌ డీసీలో ఇటీవల సెంటర్‌ ఫర్‌ ఇమిగ్రేషన్‌ స్టడీస్‌(సీఐఎస్‌) ఆధ్వర్యంలో ‘ఇమిగ్రేషన్‌ న్యూస్‌మేకర్‌’ అనే కార్యక్రమం జరిగింది. ఇందులో పాల్గొన్న సిస్నా మాట్లాడుతూ.. 2017 సంవత్సరంలో యూఎస్‌సీఐఎస్‌ 3,65,000 దరఖాస్తుదారులకు(కొనసాగింపు వీసాలతో కలిపి) హెచ్‌-1బీ వీసాలను మంజూరు చేసినట్లు తెలిపారు. గతంతో పోలిస్తే కొత్తగా హెచ్‌-1బీ వీసాలను మంజూరు చేయడం లేదా, కొనసాగింపు విషయంలో నిబంధనలను ట్రంప్‌ సర్కారు కఠినతరం చేసింది. తిరస్కరణలు కూడా ఎక్కువయ్యాయి. కొన్ని పరిస్థితుల్లో కొత్త వీసా దరఖాస్తులను తిరస్కరించడంతో పాటు, పాత వాటిని పొడిగించకుండా అడ్డుకునే అధికారం యూఎస్‌సీఐఎస్‌కు దక్కింది. తొలిసారి వీసాకోసం దరఖాస్తు చేసుకున్నవారు సరైన ధ్రువీకరణ పత్రాలు సమర్పించకపోతే ఆ దరఖాస్తులను యూఎస్‌సీఐఎస్‌ తిరస్కరిస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP Facebook Auto Publish Powered By : XYZScripts.com