తిరుపతి పార్కులలో కామకేళి

0

lovers at park_apduniaఆధ్యాత్మిక నగరం అల్లరిమూకలు, కామాంధులతో నిండిపోయింది. కుటుంబంతో కలిసి వారాంతంలో హాయిగా గడపాల్సిన పార్కులు ప్రేమజంటలతో కిక్కిరిసిపోతున్నాయి. ఈ పార్కుల్లో ఉండే చెట్ల మాటున కామాంధులు రెచ్చిపోతున్నారు. తిరుపతి అంటేనే ప్రపంచ వ్యాప్తంగా ఆధ్యాత్మిక నగరంగా గుర్తింపు ఉంది. ఎటు చూసినా దేవాలయాలు, అందులో జరిగే పూజలు, పునస్కారాలు వినిపిస్తాయి. కనిపిస్తాయి. ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న తిరుపతి నగర పరిధిలో మూడు, నాలుగు పెద్ద పార్కులున్నాయి. రోజంతా అలసిపోయి సేద తీరాలనే నగర వాసులకు ఆ పార్కులే కొంత ఉపశమనం కలిగిస్తాయి. అలాంటి పార్కుల్లో ఉన్న ప్రశాంత వాతావరణాన్ని కొన్ని చిల్లరమూకలు పాడుచేస్తున్నాయి. ప్రేమ పేరుతో యువతీయువకులు అడ్డదిడ్డంగా తిరుగుతూ పార్కులను వేదికగా చేసుకుని తమ అసాంఘిక కార్యకలాపాలను యథేచ్ఛగా కొనసాగిస్తున్నాయి. చంటిపిల్లలను పార్కులకు తీసుకువచ్చే తల్లిదండ్రులు వీళ్ళు చేసే ఇకారపు చేష్టలను చూసి తమ పిల్లలు ఎక్కడ చెడిపోతారేమోనని భయపడిపోతున్నారు. ఇక సీనియర్ సిటిజన్లు పార్కుల బయటే కబుర్లు చెప్పుకుని వెనుదిరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రవేశ రుసుము చెల్లించి మరీ ఇలాంటి ఇకారపు చేష్టలు చూడాల్సి వస్తోందని మండిపడుతున్నారు. అధికారులు మాత్రం ఇలాంటి యువతకే పెద్ద పీట వేస్తున్నట్లు తెలుస్తోంది. కొంతమంది పార్కు సిబ్బంది వీరి ఆగడాలకు వంతపాడుతూ వారి నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో నడిచే మున్సిపల్‌ పార్కులతో పాటు ధార్మిక చింతన కలిగిన శిల్పారామం కూడా ఈ యువత చేసే చేష్టలతో చెడ్డపేరు తెస్తున్నాయి.

Share.

Comments are closed.