శబరిమలలో అప్పం ప్రసాదం ఇక ఇవ్వరు

0

appam_apduniaశబరిమలలో భక్తులకు అప్పం, అరవానా అనే రెండు రకాల ప్రసాదాలను పంపిణీ చేస్తారు. అయితే ఇందులో అప్పం ఉత్పత్తిని ఆపివేయాలని శబరిమల దేవస్థానం భావిస్తున్నట్లు సమాచారం. దీన్ని కేరళ దేవాదాయ, పర్యాటక శాఖా మంత్రి కడకంపల్లి సురేంద్రన్ తప్పుబట్టారు. అప్పం ప్రసాదం ఉత్పత్తిని ఆపివేయాలని దేవస్థానం నిర్ణయించడం బాధాకరమన్నారు. అసలా నిర్ణయమే అర్థం లేనిదన్నారు. మకరవిళక్కు దగ్గరకు వస్తున్న సందర్భంలో ప్రసాదం ఉత్పత్తిని ఆపడం సరికాదన్నారు. అయ్యప్ప భక్తులు తీసుకొచ్చే బియ్యంతోనే అప్పం ప్రసాదాన్ని తయారుచేస్తారని, కాబట్టి వారు తీసుకొచ్చే బియ్యంలోని నాణ్యతను తప్పుపట్టాల్సిన పనిలేదని అన్నారు. భక్తులు తెచ్చే బియ్యంపై ఫుడ్ సేఫ్టీ అధికారులు అనుమానాలు వ్యక్తం చేయడంతో ఆలయ ప్రత్యేక కమిషనర్ వెంటనే స్పందించి అప్పం ప్రసాదం పంపిణీని ఆపేయాల్సిందిగా ఆదేశించారని మంత్రి తెలిపారు.

Share.

Comments are closed.