చికిత్స నిమిత్తం ఆస్ట్రేలియా వెళ్లిన అనుష్క

బాహుబలిలో దేవసేనగా అద్భుతంగా నటించిన అనుష్క రెండేళ్ల నుంచి ఒక్క సినిమాని కూడా అంగీకరించలేదు. గ్లామర్ పాత్రలతో పాటు లేడి ఓరియెంటెడ్ చిత్రాలతో కూడా అనుష్క మెప్పించింది. సౌత్ లో క్రేజీ హీరోయిన్ గా మారింది. కానీ ఇటీవల అనుష్క నుంచి ఒక్క చిత్రం కూడా రాకపోవడంతో చర్చనీయాంశంగా మారింది. తాజగా అనుష్క గురించి ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. చికిత్స నిమిత్తం అనుష్క ఆస్ట్రేలియాకు వెళ్లినట్లు వార్తలు వస్తున్నాయి.

అనుష్క భాగమతి చిత్రం తరువాత మరో చిత్రం చేయకపోయాడానికి కారణం ఆమె బరువే అని అంటున్నారు. సైజు జీరో చిత్రం కోసం అనుష్క బరువుపెరిగింది. బాహుబలి, భాగమతి చిత్రాల్లో స్లిమ్ గా కనిపించినప్పిటికి పూర్తి స్థాయిలో బరువు తగ్గలేదు. ప్రభాస్ నటిస్తున్న భారీ యాక్షన్ చిత్రం సాహోలో మొదట అనుష్కకే అవకాశం వచ్చినట్లు టాక్. కానీ యాక్షన్ అంశాలు ఎక్కువగా ఉండే చిత్రం కావడంతో చివరకు చిత్ర యూనిట్ శ్రద్ధ కపూర్ ని ఎంపిక చేసుకుంది. బరువు కారణంగా చేతికి వచ్చిన అవకాశాలని అనుష్క జారవిడుచుకోవలసి వచ్చింది.

అనుష్క బరువు తగ్గేందుకు దేశవ్యాప్తంగా అనేక హెల్త్ సెంటర్స్ తిరిగి ప్రయత్నాలు చేసిందట. కానీ అవేవీ సరైన ఫలితాన్ని ఇవ్వలేదు. సహజసిద్ధమైన పద్దతుల ద్వారానే బరువు తగ్గాలని భావిస్తున్న అనుష్కకు సన్నిహితులు కొందరు సలహా ఇచ్చారట. ఆస్ట్రేలియాలో బరువు తగ్గేందుకు సహజసిద్ధమైన వైద్యం చేయించుకోవాలని సూచించారట. దీనితో అనుష్క ఇటీవల ఆస్ట్రేలియా వెళ్లినట్లు తెలుస్తోంది.ఈ చికిత్స పూర్తి కాగానే అనుష్క సరికొత్త లుక్ లో మరింత నాజూకుగా కనిపించడం ఖాయం అని అంటున్నారు. ఆస్ట్రేలియా నుంచి తిరిగి వచ్చాక అనుష్క రెండు చిత్రాలని అంగీకరించే అవకాశాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

బాలీవుడ్ సెలబ్రిటీలు చాలా మంది ఆస్ట్రేలియాలోనే బరువు తగ్గి నాజూకుగా మారారు. గతంలో పరిణీతి చోప్రా, రణబీర్ కపూర్ వంటి నటులు ఇక్కడే బరువు తగ్గడం కోసం సహజసిద్ధమైన వైద్యం చేయించుకున్నారు. అనుష్క ఇక సినిమాలకు దూరం అవుతుందని కొంత కాలం నుంచి సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అనుష్క వెయిట్ లాస్ ట్రీట్ మెంట్ చేయించుకుంటున్న నేపథ్యంలో ఆ వార్తలకు చెక్ పెట్టినట్లు అయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *