అన్నాడీఎంకేతో కమలం తెగతెంపులు

వారిద్దరి వద్ద ఉపయోగం లేదని అర్థమైపోయిందా? వచ్చే ఎన్నికల్లో వీరిని నమ్ముకుంటే నట్టేట మునగడం ఖాయమని తెలిసిపోయిందా…? అందుకనే కమలం పార్టీ

వారిని దూరం పెడుతోంది. తమిళనాట అధికారంలో ఉన్న అన్నాడీఎంకే ను బీజేపీ ఇక వదిలేయదల్చుకుందన్న వార్తలు వస్తున్నాయి. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో

అన్నాడీఎంకే, బీజేపీ కలసి పోటీ చేస్తాయన్న ప్రచారం ఇటీవల కాలంలో ఉధృతంగా జరిగింది. పరిణామాలు కూడా అందుకు అనుగుణంగానే కనపడుతున్నాయి.

జయలలిత మరణం తర్వాత అన్నాడీఎంకేను శశికళ చేతుల నుంచి తప్పించడానికి పన్నీర్ సెల్వం, పళనిస్వామిని ఒక్కటి చేసింది కమలనాధులే అంటారు. పళనిస్వామి

ముఖ్యమంత్రి అయి దాదాపు ఏడాది దాటిపోయింది.అలాగే పన్నీర్ సెల్వం కు ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు అప్పగించడంలోనూ ఢిల్లీ పెద్దల జోక్యం ఉంది.

అన్నాడీఎంకే ఓటు బ్యాంకు చెక్కు చెదరదని, రానున్న లోక్ సభ ఎన్నికల్లో పన్నీర్, పళనిలను కలుపుకుని వెళితే పార్టీకి కొంత ప్రయోజనం చేకూరుతుందని కమలం

పార్టీ కేంద్ర నాయకత్వం ఆలోచన చేసింది. అందుకే నిన్న మొన్నటి వరకూ అండగా నిలుస్తోంది. తమిళనాడు విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇటీవల పార్లమెంటులో

మోదీసర్కార్ పై పెట్టిన అవిశ్వాస తీర్మానం విషయంలోనూ నరేంద్ర మోదీకి మద్దతుగా నిలిచింది. అయితే బీజేపీ వైఖరిలో మార్పు వచ్చిందంటున్నారు. అన్నాడీఎంకే తో

వెళితే నష్టపోతామని బీజేపీ తమిళనాడు శాఖ ఇచ్చిన నివేదికలో నిజముందని కేంద్ర నాయకత్వం కూడా నమ్మిందని చెబుతున్నారు.జయలలిత మరణం తర్వాత

జరిగిన తొలి ఉప ఎన్నిక ఆర్కేనగర్ లో కూడా అధికార పార్టీ ఓటమి పాలు అయిన సంగతి తెలిసిందే. దీంతో పాటు తమిళనాడులో కొత్తగా కమల్ హాసన్ మక్కల్ నీది

మయ్యమ్ పార్టీతో పాటు, రజనీకాంత్ పార్టీ కూడా వస్తుంది. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో రజనీకాంత్ పార్టీ పోటీ చేయదు. ఇది స్పష్టమే. కమల్ హాసన్ పార్టీ లోక్ సభ

ఎన్నికలకు పోటీ చేసే అవకాశముంది. ఈ నేపథ్యంలో రజనీ మద్దతు తీసుకోవడం ఉత్తమమని, అది సాధ్యం కాకుంటే డీఎంకేతో వెళ్లడమే మేలన్న అభిప్రాయంలో

కమలనాధులు ఉన్నారు. డీఎంకే కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండటంతో రజనీవైపే కమలం ఎక్కువగా మొగ్గుచూపుతున్నారని చెబుతున్నారు.అందుకే అన్నాడీఎంకు

దూరం జరగాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇటీవల ఢిల్లీ వెళ్లిన ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వానికి రక్షణ మంత్రి నిర్మలాసీతారామన్ కనీసం అపాయింట్ మెంట్ a

కూడా ఇవ్వకపోవడం ఇందులో భాగమేనంటున్నారు. కరుణానిధి ఆరోగ్యం విషయంలో ప్రభుత్వం వ్యవహరించిన తీరును కూడా ప్రభుత్వం తప్పుపట్టిందని, పళనస్వామికి

కేంద్రం పెద్దలు అక్షింతలు వేశారని చెబుతున్నారు. సేలం జిల్లా పర్యటనలో ఉన్న పళనిస్వామి తన కార్యక్రమాలను అకస్మాత్తుగా రద్దు చేసుకుని చెన్నై రావడంతో

కరుణానిధి ఆరోగ్యంపై వదంతులు వ్యాప్తి చెందాయి. దీంతో కొందరు డీఎంకే అభిమానులు మృతి చెందారు. ఈ పరిస్థితుల్లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మాత్రం

తమిళనాడులో పార్టీ సొంతంగా ఎదిగేందుకు ప్రయత్నించాలని కోరారు. బీజేపీ జాతీయ కార్యదర్శి మురళీధరరావును తరచూ తమిళనాడులో పర్యటించాల్సిందిగా

ఆదేశించినట్లు తెలుస్తోంది. మొత్తం మీద ఉపయోగం లేని పార్టీ ఉన్నా…ఒకటే…లేకున్నా…ఒకటే అన్నట్లు బీజేపీ అన్నాడీఎంకేతో వ్యవహరిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP Facebook Auto Publish Powered By : XYZScripts.com