అన్న క్యాంటీన్ల మెన్యూ విడుదల

ఏపీ ప్రభుత్వం భారీ ఎత్తున అన్న క్యాంటీలను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ క్యాంటీన్ల ద్వారా అందించే అల్పాహారం, భోజన పట్టికను ప్రభుత్వం ప్రకటించింది. ఈ రోజు నుంచి ఈ మెన్యూ అమల్లోకి రానుంది.

అల్పాహారంలో భాగంగా ప్రతి రోజు ఇడ్లీ, పొడి, సాంబారు కచ్చితంగా ఉంటుంది. దీనికి తోడు సోమవారం పూరి, కుర్మా ఉంటుంది. మంగళవారం ఉప్మా, బుధవారం పొంగల్, గురువారం పూరి, శుక్రవారం ఉప్మా, శనివారం పొంగల్ ఉంటుంది. అల్పాహారం ఉదయం 7.30 గంటల నుంచి 10 గంటల వరకు లభిస్తుంది. ఇడ్లీ, పూరి మూడు చొప్పున ఇస్తారు. ఉప్మా, పొంగలి 250 గ్రాములు పంపిణీ చేస్తారు.

భోజనం మాత్రం వారం రోజులు ఒకేలా ఉంటుంది. మధ్యాహ్నం, రాత్రి వేళల్లో అందించే భోజనంలో రైస్, కూర, పప్పు, సాంబారు. పెరుగు, పచ్చడిని పంపిణీ చేస్తారు. వారానికి ఒక రోజు స్పెషల్ రైస్ వడ్డిస్తారు. మధ్యాహ్నం 12.30 గంటల నుంచి 3 గంటల వరకు… రాత్రి 7.30 గంటల నుంచి 9 గంటల వరకు భోజనం అందుబాటులో ఉంటుంది. ఒక్కొక్కరికి 400 గ్రాముల అన్నం అందిస్తారు. ఆదివారం అన్నా క్యాంటీన్లకు సెలవును ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP Facebook Auto Publish Powered By : XYZScripts.com