ప్లే స్కూల్స్ గా అంగన్ వాడీ కేంద్రాలు

0

ఏలూరు నగరంలోని 39 అంగన్ వాడీ కేంద్రాలను ప్లే స్కూల్స్ గా తీర్చిదిద్ది చిన్న వయస్సులోనే మంచి విధ్యను అందిస్తామని మేయర్ షేక్ నూర్జహాన్ చెప్పారు. స్థానిక 50 వ డివిజన్ లో శనివారం అర్బన్ డెవలప్ మెంట్ అధారిటీ ఆధ్వర్యంలో అంగన్ వాడీ పిల్లలకు మేయర్ ఉచిత పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఏలూరు నగరంలో 110 అంగన్ వాడీ కేంద్రాలు ఉండగా ప్రభుత్వ ఆదేశాలమేరకు 3 అంగన్ వాడీ కేంద్రాలను కలిపి ఒకే అంగన్ వాడీ కేంద్రంగా తీర్చిదిద్దుతామని, కార్పొరేట్ నర్సరీ స్కూల్స్ కు దీటుగా అంగన్ వాడీ ప్లే స్కూల్స్ ను అభివృద్ది చేస్తామని చెప్పారు. ప్రతీ అంగన్ వాడీ కేంద్రంలో వివిధ రకాల ఆటవస్తువులు , మంచిమంచి పెయింటింగ్ లతో ఆహ్లాదకర వాతావరణంలో విద్యను బోధించడం జరుగుతుందని చెప్పారు. అంగన్ వాడీ భవవాన్ని 7 లక్షల రూపాయల వ్యయంతో నిర్మిస్తామని, ప్రతీ భవనంలోను అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తామని, 39 అంగన్ వాడీ భవనాల నిర్మాణానికి త్వరలో చర్యలు తీసుకుంటామని మేయర్ శ్రీమతి షేక్ నూర్జహాన్ చెప్పారు. ఈ కార్యక్రమంలో కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, డిప్యూటీ మేయర్ నెర్సు సుగుణ, 50వ డివిజన్ కార్పొరేటర్ ఎల్లపు సత్యవతి, కమీషనర్ మోహనరావు, సిడిపిఒ జయలక్ష్మి, డిఇ కొండలరావు, తదితరులు పాల్గొన్నారు.

Share.

About Author

Leave A Reply