ఏపీ ప్రభుత్వ అధికారిక లోగో మార్పు

0

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర చిహ్నం ( ప్రభుత్వ అధికారిక లోగో )ను మార్చివేసింది. 1964 నుంచి రాష్ట్ర చిహ్నంగా ఉన్న పూర్ణకుంభాన్ని మారుస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే కొత్త చిహ్నం కూడా పూర్ణకుంభంతోనే రూపొందింది. పాత చిహ్నంలో ‘ఆంధ్రప్రదేశ్’ అనే పేరు పైన ఆంగ్లంలో.. కింద తెలుగు, హిందీ భాషల్లో ఉంటుంది. కొత్త చిహ్నంలో మాత్రం పైన తెలుగులో.. కింద హిందీ, ఆంగ్ల భాషల్లో ఉంటుంది. పాత చిహ్నంలో కింద భాగంలో ఉన్న ‘సత్యమేవ జయతే’ అన్న వాక్యం హిందీలో ఉండగా.. దాన్ని ఇప్పుడు తెలుగులోకి మార్చారు. ఇక పాత చిహ్నంలో ఉన్న మాదిరిగానే.. పూర్ణ కుంభం మధ్యలో ఉంది. దాని కింద నాలుగు సింహాలు ఉన్నాయి.

Share.

About Author

Leave A Reply