ఘనంగా ప్రారంభమైన ఆండాళ్ అమ్మవారి తిరువడిపురం ఉత్సవం

తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో శనివారం శ్రీ ఆండాళ్ అమ్మవారి తిరువడిపురం ఉత్సవం ఘనంగా ప్రారంభమైంది. ఇందులో భాగంగా ఉత్సవ రోజుల్లో ఉదయం 6.00 నుండి 6.30 గంటల వరకు శ్రీ ఆండాళ్ అమ్మవారికి తిరుమంజనం, సాయంత్రం 5.30 నుండి 6.30 గంటల వరకు అమ్మవారిని ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహిస్తారు.
అగస్టు 10వ తేదీ సాయంత్రం అమ్మవారి ఊరేగింపుతోపాటు శుక్రవార ఆస్థానం నిర్వహిస్తారు. ఆగస్టు 13వ తేదీన ఉదయం 9.30 నుండి 11.30 గంటల వరకు శ్రీ గోవిందరాజస్వామివారు, శ్రీ ఆండాళ్ అమ్మవారి ఉత్సవమూర్తులకు స్నపనతిరుమంజనం నిర్వహిస్తారు. సాయంత్రం 4.00 నుండి 8.00 గంటల వరకు శ్రీగోవిందరాజస్వామివారు, శ్రీ ఆండాళ్ అమ్మవారిని అలిపిరికి తీసుకెళ్లి అక్కడ ఆస్థానం నిర్వహిస్తారు. ప్రత్యేకపూజల అనంతరం అలిపిరి నుండి గీతామందిరం, రామనగర్ క్వార్టర్స్, వైఖానసాచార్యుల వారి ఆలయం, ఆర్ఎస్ మాడ వీధి, చిన్నజీయర్ మఠం మీదుగా ఊరేగింపు తిరిగి ఆలయానికి చేరుకుంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP Facebook Auto Publish Powered By : XYZScripts.com