మారుతోన్న అనంతపురం..

0

2014 తర్వా అనంత‌పురం జిల్లా రూపు రేఖలు మారిపోయాయి. అస‌లు మునుప‌టి సారి ముఖ్య‌మంత్రిగా ఉన్న‌పుడు చంద్ర‌బాబు కూడా ఇంత‌గా ప‌ట్టించుకోలేదు. కానీ… ఈరోజు అనంత‌పురం ఓ రేంజిలో ఉందంటే… అది కేవ‌లం చంద్ర‌బాబు ఆ జిల్లాపై కురిపించిన ప్రేమ‌. చాలా మంది ఇత‌ర జిల్లాల వారికి అనంత‌పురం జిల్లా ప‌రిస్థితి గాని, అక్క‌డ వ్య‌వ‌హారం గాని కొత్త‌. పుట్ట‌పుర్తి, లేపాక్షి మిన‌హా అనంత‌పురం జిల్లా ప‌రిస్థితి ఏంటో అనంత‌పురం గురించి చాలా మందికి తెలియ‌దు. ఎక్కువ మందిలో అది క‌ర‌వు జిల్లా అని మాత్రం అభిప్రాయం ఉంటుంది. అవును అది క‌ర‌వు జిల్లానే ఇపుడు కాదు. 2014కి ముందు క‌ర‌వు జిల్లా. ఇపుడు అక్క‌డ నీరు పార‌ని నియోజ‌క‌వ‌ర్గం లేదు. కృష్ణ‌మ్మ‌ను 300 కిలోమీట‌ర్ల దూరం వెన‌క్కు తీసుకెళ్లి ఎత్తిపోత‌ల ప‌థ‌కం ద్వారా అనంత‌పురంలోని చిట్ట‌చివ‌రి ప‌ల్లెకు కూడా నీళ్లివ్వ‌డానికి ప్ర‌ణాళిక‌లు పూర్తి చేసి ప‌నులు మొద‌లుపెట్టారు. ఇప్ప‌టికే జిల్లాలోని అత్య‌ధిక ప్రాంతానికి నీళ్లొచ్చాయి. ఇంకోసారి చంద్ర‌బాబు అధికారంలోకి వ‌స్తే అనంత‌పురం జిల్లా దృశ్యాలు, గోదావ‌రి జిల్లాల్లాగే సుంద‌రంగా ద‌ర్శ‌న‌మిస్తాయి. చాలామందికి తెలియ‌దు గాని అనంత‌పురం జిల్లా హైద‌రాబాదు లివింగ్ కాస్ట్ త‌క్కువ‌. ఒక దోసె హైద‌రాబాదులో 20 రూపాయ‌ల‌కు కూడా దొరుకుతుంది. అనంత‌పురంలో సిట్టింగ్ ఉన్న హోట‌ల్లో దోసె రేటు మినిమం రూ.35. కొబ్బ‌రిబోండాం రూ.10 నుంచి హైద‌రాబాదులో అమ్ముతారు. మ‌హా అయితే ఒక‌టి రూ.30 దాకా అమ్ముతారు. అనంత‌పురంలో కొబ్బ‌రి బోండా మిన‌మం 40, పెద్ద‌వి 50. హైద‌రాబాదులోని మియాపూర్ లో అపార్ట్‌మెంట్ ఫ్లాట్ రేటు కంటే అనంత‌పురంలో రేటు ఎక్కువ‌. హైద‌రాబాదు అవుట‌ర్ రింగ్ రోడ్డు కంటే అనంత‌పురం శివారులో గ‌జం స్థ‌లం విలువ ఎక్కువ‌. ఇలా ఏవిష‌యంలో తీసుకున్నాఅనంత‌పురం చాలా కాస్ట్లీ. అయినా కూడా అమ్మ‌కాలు కొనుగోళ్లు ఏ మాత్రం త‌క్కువ లేదు. చంద్ర‌బాబు వ‌చ్చాక అక్క‌డి ప్ర‌జ‌ల ఆదాయం ఆస్థాయిలో పెరిగింది.ఇక పారిశ్రామికంగా కియా త‌ర్వాత అనంత‌పురం ద‌శ నెట్‌వ‌ర్త్ మారిపోయింది. జిల్లాలో జాతీయ ఎయిర్‌పోర్ట్, జిల్లాకు అతిస‌మీపంలో బెంగుళూరులో అంత‌ర్జాతీయ ఎయిర్‌పోర్టు ఈ జిల్లాకు పెద్ద అస్సెట్‌. ఇపుడు జిల్లాలో నాలుగు జాతీయ ర‌హ‌దారులు ఉన్నాయి. ఈ విష‌యం చాలామందికి తెలియ‌దు. ఉపాధికి కొర‌త‌లేని జిల్లాగా ఇపుడు అనంత‌పురం అవ‌త‌రించింది. భ‌విష్య‌త్తుల్లో ఒక రిచ్ జిల్లాగా అత‌రించినా అనంత‌పురం గురించి ఆశ్చ‌ర్య‌పోన‌క్క‌ర్లేదు

Share.

About Author

Leave A Reply