బన్నీ కూతురుకు ఎ తో పేరు కావాలి…

0

allu-arjun-apduniaబాలీవుడ్‌లో కూడా పిల్లలకు పేర్లను ఏదో ఆస్ట్రాలజీ బట్టి కాకుండా.. తల్లి తండ్రి ఇనీషియల్ వచ్చేలా పెడుతుంటారు. ఇదే టాలీవుడ్లో అల్లూ వారి ఫ్యామిలీ కూడా ఫాలో అవుతున్నట్లు అనిపిస్తోంది. అనిపించడం ఏంటి.. కనిపిస్తోంది కూడా. ఆల్రెడీ అల్లు అర్జున్‌ ఉన్నాడు.. ఇంటి పేరు ‘ఎ’ అనుకుంటే.. మనిషి పేరు కూడా ‘ఎ’ తో మొదలైంది. ఇక అల్లు వారింట్లో పుడుతున్న పిల్లలందరికీ ‘ఎ’ అనే అక్షరంతోనే పేర్లు పెట్టాలని డిసైడైన ట్లున్నారు. ఆల్రెడీ బన్నీ అన్నయ్య కూతురు పేరు అన్విత అని పెట్టారు. బన్నీ కొడుకు పేరును అయాన్‌ అని నామధేయం చేశారు. అంటే అందరూ ఎ-ఎ అంటూ బన్నీ పెట్టే సైన్‌ ను చక్కగా వాడేసుకుంటారు అన్నమాట. ఇప్పుడిక బన్నీ-స్నేహల రెండో సంతానం అయిన క్యూట్‌ గాళ్‌ పేరును కూడా ‘ఎ’ అనే అక్షరంతోనే పెడతారని తెలుస్తోంది. అందుకే ఇప్పుడు ‘ఎ’ అనే అక్షరంతో కొత్తగా అనిపించే ఆడపిల్లల పేర్లను ఆల్రెడీ అల్లూ ఫ్యామిలీ స్టడీ చేస్తోందట. మొత్తానికి ‘ఎ-ఎ’ ఫ్యామిలీగా అల్లూ వారి తరువాత తరం అంతా వర్ధిల్లుతుంది అనమాట. ఇక బన్నీ కూతురి పేరేంటో తెలియాలంటే మాత్రం కొన్నాళ్లు వెయిట్‌ చేయాల్సిందే.

Share.

Comments are closed.