సంక్రాంతి సందడితో పల్లెలు

0

sankranthi-apduniaసంక్రాంతి పర్వదినం తెలుగు ప్రజలకు అత్యంత ప్రధానమైంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ పండుగను చాలా గొప్పగా జరుపుకుంటారు. మూడు రోజుల పాటు జరుపుకునే ఈ పండుగలో.. రైతులు ఏడాది పాటు శ్రమించి పంటలు పండించి చేతికివచ్చిన పంటలు,నగదుతో గోవులను, లక్ష్మీదేవిని పూజిస్తారు. పితృదేవతలకు తర్పణాలు పెడతారు. పిల్లలు ఎంతో సంతోషంగా గాలి పటాలు ఎగరవేస్తారు. యువతులు రంగు రంగుల ముగ్గులు పెడుతూ..వాటిలో గొబ్బెమ్మలు పెడతారు.

నెల రోజుల ముందు నుంచే పల్లెలన్నీ ముత్యాల ముగ్గులతో కళకళలాడుతూ సంక్రాంతి శోభను సంతరించుకుంటాయి. కోడిపందాలు, కొత్త అల్లుళ్లు, ఘమఘుమలాడే పిండివంటలతో సంక్రాంతికి మరింత కళ వస్తుంది. సెలవలు రావడంతో పిల్లలు, పెద్దలు, బందువులు దూర ప్రాంతాలనుండి ఇళ్లకు చేరుకున్నారు.

ఇక టీనేజ్ అమ్మాయిలా జోరు అంతా ఇంతా కాదు. ఒకరిని మించి మరోకరు వాకిళ్లలో ముగ్గులు పెడుతూ..రంగులు దిద్దుతూ ఏ ఇంటి ముందు ఎవరు ముగ్గు బాగా వేశారంటూ….ఒకరి ముగ్గు ఒకరు చూసుకుంటూ మురిసిపోతారు.
ఇక డూడూ బసవన్నల గురించి చెప్పనవరం లేదు. గంగిరెద్దులను ఇంటి ముందు ఉంచి డోలు సన్నాయి వాయిస్తూ ఆట,పాటలతో తెగ హడావిడి చేస్తూ వారు ఇచ్చే కానుకలు స్వీకరిస్తారు. ఇక హరిదాసులు నెల రోజుల ముందు నుంచే భజనలు, కీర్తనలు చేస్తూ…మహిళలు వేసిన ముగ్గులు దాటుతూ వారిచ్చే కానుకలు తీసుకుంటూ కలకాలం సుఖ సంతోషాలతో వర్దిల్లాలని ఆశ్వీరదిస్తారు.

నోట్ల రద్దు వ్యవహారం గత కొంత కాలంగా సామాన్య, మద్య తరగతి ప్రజానికాన్ని ఉక్కిబిక్కిరి చేశాయి. నోట్ల కొరతతో తీవ్రమైన ఇబ్బందులు పడ్డారు. ఇలాంటి తరుణంలో ఏడాది ప్రారంభంలో వచ్చె తొలి పండుగ సంక్రాంతి కావడంతో అప్పొసప్పో చేసి పండుగ శోభకు సిద్దమవుతున్నారు. మొత్తం మీద తెలుగు లోగిళ్లకు సంక్రాంతి పండగ కొత్త కాంతిని తీసుకొచ్చినా నోట్ల రద్దు వ్యవహారం ప్రజలను తీవ్రమైన వేదనకు గురి చేశాయి..

Share.

Comments are closed.