ఉత్తరప్రదేశ్‌ CM అఖిలేష్‌ యాదవ్‌ ములాయం సింగ్‌ యాదవ్‌తో భేటీ

0
akhilesh_apdunkiaఉత్తరప్రదేశ్‌లోని అధికార స‌మాజ్‌వాదీ పార్టీలో చెల‌రేగిన‌ విభేదాల కార‌ణంగా ఆ పార్టీ నేత‌లు రోజుకో ట్విస్ట్ ఇస్తున్నారు. ఆ పార్టీ వ్యవస్థాపకులు ములాయం సింగ్ యాద‌వ్ నిన్న త‌మ‌ పార్టీ గెలిస్తే అఖిలేషే ముఖ్యమంత్రి అని ప్రకటన చేసిన సంగ‌తి తెలిసిందే. అనంత‌రం ములాయం మనవరాళ్లు, అఖిలేష్ యాదవ్ కుమార్తెలు అదితి, టీనాల‌తో రాయ‌బారం జ‌రిపిన‌ట్లు కూడా వార్త‌లు వచ్చాయి. ఈ నేపథ్యంలో, అనూహ్యంగా ఈ రోజు ఉదయం ముఖ్యమంత్రి అఖిలేష్‌ యాదవ్‌ తన తండ్రి ములాయం సింగ్‌ యాదవ్‌తో భేటీ అవ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. పార్టీలో వారిద్ద‌రి మ‌ధ్య రాజీ జ‌రగ‌నుంద‌ని, ఇదో కీలక రాజకీయ పరిణామం అని ఆ పార్టీ నేత‌లు అంటున్నారు. ఈ భేటీలో ఏయే విష‌యాలు చ‌ర్చిస్తారో.. అనంత‌రం ఏ అంశాన్ని ప్ర‌క‌టిస్తారో వేచిచూడాలి.
 
 
Share.

Comments are closed.