మరోసారి తెరపైకి మోడీ డిగ్రీ అంశం

0

modi7_apduniaభారత ప్రధాని నరేంద్ర మోడీ డిగ్రీ కూడా చదవలేదని, ఒకవేళ చదివి ఉంటే దానికి ఆధారాలు చూపాలని గతంలో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. ఈ అంశం మరోసారి తెర పైకి వచ్చింది. కేజ్రీవాల్ మద్దతుదారుడు నీరజ్ శర్మ మోడీ డిగ్రీ వివరాలు వెల్లడించాలని పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ఢిల్లీ యూనివర్సిటీ వర్గాలు మోడీ డిగ్రీ వివరాలను అందించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. గతంలో నీరజ్ శర్మ సమాచార హక్కు చట్టం ద్వారా మోడీ డిగ్రీ వివరాలు అందించాలని ఢిల్లీ యూనివర్సిటీని ఆశ్రయించారు. ఆ సమయంలో వివరాలను తెలియజేసేందుకు ఢిల్లీ యూనివర్సిటీ నిరాకరించింది. అతడు సమాచార కమిషన్ కు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుకు స్పందించిన సమాచార కమిషన్ మోడీ డిగ్రీ వివరాలను అందించేందుకు నిరాకరించిన సహ అధికారి మీనాక్షి సాహేకు రూ.25 వేలు జరిమానా విధించి.. వివరాలు అందించాలని ఆదేశించారు. ఈ విషయం పై రిజిస్ట్రార్ స్పందించారు. మోడీ డిగ్రీ అంశంపై వచ్చిన ఆరోపణలతో గత పత్రాలన్నీ పరిశీలించామని, మోడీ 1978లో పరీక్షలకు హాజరయ్యారని, 1979లో పట్టా అందుకున్నారని పేర్కొన్నారు.

Share.

Comments are closed.