మళ్లీ పెరుగుతున్న బంగారం ధరలు

0

gold-rates-apduniaపెద్దనోట్ల రద్దు బంగారం పై తీవ్ర ప్రభావం చూపింది. కొనుగోళ్లు లేక కొద్ది రోజులుగా నేల చూపులు చూసిన బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. ట్రేడింగ్‌లో 10గ్రాముల స్వచ్ఛమైన పసిడి రూ.330 పెరిగి రూ.29,030కు చేరింది. నగల తయారీదారుల నుంచి కొనుగోళ్లు పెరగడంతో పసిడి ధర పెరిగిందని బులియన్‌ ట్రేడింగ్‌ వర్గాలు తెలిపాయి. అంతేకాకుండా డాలర్‌ బలపడట.. బంగారం సురక్షితమైన పెట్టుబడిగా భావించడంతో లావాదేవీలు పెరగాయని పేర్కొన్నారు.అంతర్జాతీయంగా 0.43శాతం పెరిగిన బంగారం ధర ఔన్సు 1,185.90 డాలర్లు పలికింది. వెండి కూడా బంగారం దారిలోనే పయనిస్తోంది. రూ.350 పెరిగి.. కిలో వెండి రూ.40,750కు చేరింది. పరిశ్రమలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్లకు మద్దతు ఉండటంతో వెండి ధర పెరుగుదలకు కారణమైందని విశ్లేషకులు తెలిపారు

Share.

Comments are closed.