రాజమౌళి, మహేశ్‌ కాంబినేషన్‌

0

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ మూవీ తర్వాత.. రాజమౌళి చేయబోయేది మహేశ్‌ చిత్రమే అని చిత్రపరిశ్రమలో బలంగా వినిపిస్తోంది. అయితే 2020 వరకూ రాజమౌళి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రంతో బిజీగా ఉండనున్నారు. ఈలోపు మహేశ్‌.. సుకుమార్, సందీప్‌ రెడ్డితో సినిమాలు పూర్తి చేసుకుంటారని టాలివుడ్ టాక్. ఇదిఇలా ఉంటే రాజమౌళి, మహేశ్‌ కాంబినేషన్‌లో వచ్చే సినిమా ఓ సరికొత్త పాయింట్‌తో ఉండబోతోందని ప్రచారం ఇప్పటి నుంచే జరుగుతోంది. మరో విశేషమేంటంటే ఈ మూవీ ద్వారానే మహేశ్‌ బాలీవుడ్‌కి ఎంట్రీ ఇవ్వనున్నారట. తెలుగు, హిందీలో ద్విభాషా చిత్రంగా దర్శక ధీరుడు రాజమౌళి ఈ మూవీని తెరకెక్కిస్తారట. మరి అధికారికంగా ప్రకటించే వరకు ఈ కాంబినేషన్‌పై ఇంకా ఎన్ని వార్తలు వస్తాయో చూడాలి.

Share.

About Author

Leave A Reply