నటి సబర్ణ రేప్..ఆపై హత్య?

0

sabarna_apduniaబుల్లితెర నటీ సబర్ణది హత్యా లేకుంటే ఆత్మహత్యా అనే దానిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. చెన్నై మదురైవాయిల్‌లోని తన ఇంట్లో ఆమె విగతజీవిగా ఉండగా మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సబర్ణ నగ్నంగా మృతిచెంది ఉండడంతో ఆమె అత్యాచారానికి గురై.. హత్య చేయబడిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఆమె చేతిని బ్లేడుతో తెగ్గోసినట్లు ఉందని, సబర్ణ ఆత్మహత్య చేసుకున్నారా లేకుంటే ఆమెను ఎవరైనా రేప్ చేసి హత్య చేశారా అని పోలీసులు ఆరా తీస్తున్నారు. సబర్ణ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న అపార్ట్‌మెంట్లో బీర్ బాటిల్స్, సిగరెట్లు, గంజాయి వంటి ప్యాకెట్లను కూడా పోలీసులు కనుగొన్నారు. ఇంటి తలుపులు తెరిచే ఉన్నాయని, ఆమె డైరీని కూడా స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు.

Share.

Comments are closed.